Friday, November 1, 2024

మనం మంచి నీళ్లే తాగుతున్నామా?.. ఇది తెలుసుకోండి!

మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే… అమెరికా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా…. 2016లో శీతల పానీయాల అమ్మకాలను… మంచి నీళ్ల అమ్మకాలు అమాంతం మించిపోయాయి. 2017లో ఈ అంతరం మరింత పెరిగిపోయింది. “అమెరికా బెవరేజెస్ కార్పొరేషన్” గణాంకాల ప్రకారం… 2017లో అమెరికా ప్రజలు ఏకంగా 9 బిలియన్ గ్యాలన్ల బాటిల్డ్ వాటర్ ను తాగేశారు. అయితే ఇప్పుడిప్పుడు ఈ ధోరణిలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. పలువురు చిత్రరంగ మరియు క్రీడారంగ ప్రముఖుల బాటలో… సాధారణ ప్రజానీకం సైతం “బాటిల్డ్ మినరల్ వాటర్”కు బదులుగా “స్ప్రింగ్/నేచురల్ మినరల్ వాటర్” వినియోగం వైపు మొగ్గు చూపుతున్నారు!!

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ) మొదలుకుని… ప్రపంచవ్యాప్తంగా గల పలు ప్రఖ్యాత ఆరోగ్య సంస్థల పరిశోధనల్లో… రసాయనాలతో శుద్ధి చేయబడిన ఆర్.ఓ బాటిల్డ్ వాటర్ కంటే… ప్రకృతి నుంచి సేకరించిన సహజసిద్ధమైన నీళ్ల వల్ల ఒనగూరే ప్రయోజనాలు అనేక రెట్లు ఎక్కువని తేటతెల్లమయ్యింది. దాంతో… నేచురల్ వాటర్ వినియోగం రోజురోజుకూ అధికమవుతోంది. ప్రముఖులతోపాటు సామాన్యులు కూడా ఈ నేచురల్ నీటి వినియోగంలో పోటీ పడుతున్నారు. సహజసిద్ధంగా ప్రకృతి ప్రసాదించే ఆరోగ్య ప్రయోజనాన్ని ఎవరు మాత్రం కాదనుకుంటారు?

ఇప్పుడు మెల్లగా ఈ ధోరణి మన ఇండియాలో కూడా చాలా వేగంగా విస్తరిస్తోంది. ప్రచార గిమ్మిక్కులు, మార్కెటింగ్ మాయాజాలం ప్రభావంతో కాకుండా… శాస్త్రబద్ధ పరిశోధనలు, హేతుబద్ధ అధ్యయనాలు విస్తృతంగా అందుబాటులోకి రావడం వల్ల మన భారతీయులు సైతం…. బాటిల్డ్ ఆర్.ఓ వాటర్ కు బై బై చెబుతూ… నేచురల్ మినరల్ వాటర్ కు సాదరంగా స్వాగతం పలుకుతున్నారు!!

ఇంతకూ ఇంత
ఈ క్రేజ్ కు కారణమేంటి?

“నేచురల్ మినరల్ వాటర్” (ప్రకృతి నుంచి సేకరించిన సహజసిద్ధమైన నీరు) అనేది కూడా మార్కెటింగ్ వ్యూహంలో భాగమేనా? మనం మన మెదడుకు కొంచెం పదును పెడితే…. మన ఇళ్లల్లో చాలామంది “స్టీల్ వాటర్ ఫిల్టర్” వినియోగించడం జ్ఞప్తికి వస్తుంది. మనం ఎదిగే కొద్దీ స్టీల్ ఫిల్టర్ కాస్తా ఆక్వా గార్డ్/ఆల్కాలైన్/స్మార్ట్ వాటర్/మినరల్ వాటర్ గా పరిణామం చెందింది. గడిచిన కొన్ని దశాబ్దాలు మన ఇళ్లల్లో పైన పేర్కొన్నవి దర్జాగా తిష్ట వేసుకున్నాయి. ఇందుకు సంబంధించి మార్కెట్ లోకి ప్రవేశించే ప్రతి నూతన ఆవిష్కరణ… మనం నీటిని శుద్ధి చేయడం కోసం అప్పటివరకు మనం అనుసరిస్తూ వచ్చిన పద్ధతిని తప్పు పట్టింది. ఇంకా సూటిగా చెప్పాలంటే “అపహాస్యం” చేసింది. అది కూడా “వారిదైన” అత్యంత శాస్త్రీయ పద్ధతిలో.
అయితే అవన్నీ ఒట్టి “నీటి బుడగల”ని, అభూత కల్పనలని తేలిపోయింది. వాస్తవాలతో/నిజలతో అవేవీ పోటీపడలేక చతికిలపడిపోతున్నాయి!!

చిన్నపిల్లలకు “ఆర్.ఒ.వాటర్”
సురక్షితమైనదేనా?

తాజా పరిశోధనల ప్రకారం ఇప్పటివరకు అత్యంత ఘనంగా ప్రచారం చేయబడిన “ఆర్.ఒ.వాటర్” పలు అనారోగ్యాలకు ప్రత్యక్షంగా కానీ… పరోక్షంగా కానీ కారణమవుతోంది. హైపర్ టెన్షన్/గ్యాస్టిక్/అల్సర్/జాండిస్ తదితర వ్యాధులకు “ఆర్.ఒ.వాటర్” నీరు పోసి పెంచి పోషిస్తోంది. హృదయ/కాలేయ/ఉదర సంబంధ ఆరోగ్య సమస్యలు ఆర్.ఒ.వాటర్ వల్ల తలెత్తుతున్నాయని పలు పరిశోధనల వల్ల తెలుస్తోంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మరియు పసి పిల్లలకు ఆర్.ఒ.వాటర్” అస్సలు సురక్షితం కాదని నీటి శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు!!

“ఆర్.ఒ.వాటర్” తాలూకు మంచి/చెడు/ప్రమాదకర లక్షణాలు
సవివరంగా తెలుసుకునేందుకు దిగువ లింక్ క్లిక్ చేయండి!!

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్.జి.టి)-
ఆర్.ఒ.వాటర్ నడుమ
చట్టపరమైన పోరాటం!!

గత కొన్నేళ్లుగా ఎన్.జి.టి (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) – ఆర్.ఓ.వాటర్ మధ్య చట్టపరమైన పోరాటం జోరుగా జరుగుతోంది. భారతదేశపు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు… ఆర్.ఓ.వాటర్ ను నిషేధించాలన్న సూచనకు కట్టుబడి తదనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది!!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x