జోరున వర్షం పడడంతో నలుగురు వ్యక్తులు ఓ చెట్టు కిందకు వెళ్లి నిలబడ్డారు. అయితే ఉన్నట్లుండి వారిపై నేరుగా పిడుగు పడింది. అంతే క్షణంలో వారంతా అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఇదంతా ఎదురుగా ఉన్న ఇంట్లోని కెమెరాలో రికార్డయింది. ఉత్తరప్రదేశ్‌లోని గుర్గావ్, సెక్టార్-82 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
సెక్టార్-83లోని ఓ పార్క్‌లో పనిచేసే నలుగు సిబ్బంది ఎప్పటిలానే శుక్రవారం కూడా పనిచేశారు. అయితే ఉన్నట్లుండి వర్షం పడడంతో వారంతా అక్కడే ఉన్న ఓ చెట్టు కిందకు వెళ్లి నిలుచున్నారు. వారు చేస్తున్న అతిపెద్ద తప్పు అదని వారికి ఆ క్షణం తెలియదు. కానీ కొద్ది క్షణాల్లోనే వారు నిలబడిన చెట్టుపైనే నేరుగా ఉన్నట్లుండి ఓ పిడుగు పడింది. దాంతో నలుగురూ మూర్ఛపోయారు. ఏం జరిగిందో కూడా అర్థం కాకముందే తెలివి కోల్పోయారు. సాధారణంగా ఈ స్థాయిలో పిడుగు తాకితే అందులో చిక్కుకున్న వారంతా అక్కడికక్కడే చరిపోతారు. అయితే వీరిని అదృష్టవశాత్తూ పక్కనున్న వారు వెంటనే గుర్తించి దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. దీంతో ముగ్గురు వ్యక్తులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే నాలుగో వ్యక్తి మాత్రం మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.
Deadly Lightening in Gurgaon pic.twitter.com/nHygeNH3jX
— Sheela Bhatt शीला भट्ट (@sheela2010) March 12, 2021
ఇదిలా ఉంటే వర్షం పడుతున్నపుడు, ఉరుములు, మెరుపులు ఎక్కువగా ఉన్నప్పుడు చెట్ల కింద తలదాచుకోవడం మంచిదికాదని, చెట్లు సాధారణంగానే పిడుగులను ఆకర్షస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా సెల్‌ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా పిడుగులను ఆకర్షిస్తాయట. ఐరన్ వంటి ఖనిజ పదార్థాలు కూడా పిడుగులను ఆకర్షిస్తాయని, అందువల్ల జోరున వర్షం పడే సమయంలో వాహనాలప వెళ్లేవారు పక్కన ఆపుకోవడం మంచిదనేది నిపుణుల మాట. అలాగే.. సెల్ ఫోన్ మాట్లాడడం, బ్లూటూత్ ఆన్‌లో ఉంచడం కూడా మంచిది కాదట. కుదిరితే మొబైల్ స్విచ్ ఆఫ్‌లో ఉంచడం మేలని సూచిస్తున్నారు.