Sunday, March 22, 2026

పిల్లలతో కలిసి పోర్న్ చూసే తల్లి.. తానే స్వయంగా చెప్పడంతో..

ఓ తల్లి, తన ఇద్దరు పిల్లలు కూర్చుని వీడియోలు చూస్తుంటారు. అయితే అవేవో ఫ్యామిలీ వీడియోలు అనుకోకండి. పోర్న్ వీడియోలు. షాకయ్యారా..? కానీ ఇది నిజం.

పిల్లలు టెక్నాలజీని ఆన్‌లైన్‌లో పోర్న్ వీడియోలు చూస్తుంటే వారిని మందలించే తల్లిదండ్రులను చూశాం కానీ, ఇలా పిల్లలతో కలిసి పోర్న్ చూసే తల్లిని చూడలేదంటారా..! కానీ ఇండోనేషియాకు చెందిన ఓ మహిళ మాత్రం ఇదే పని చేస్తోంది.

తాజాగా ఆమె ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడంతో అంతా షాక్‌కు గురయ్యారు.

యుని శరా.. ఇండోనేషియాలో పాపులర్ పాప్‌ స్టార్‌. ఆమెకు ఇద్దరు కొడుకులు. ఈ మధ్య ఆమె ఒక యూట్యూబ్‌ ఇంటర్య్వూలో తన కొడుకులతో తన బంధం గురించి వివరించింది.

ఇదే సమయంలో ఆమె కొన్ని మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు చెప్పింది. 47 ఏళ్ల వయసున్న యూనీ, తన ఇద్దరు కొడుకులు.. కెవిన్‌ సియాహన్‌, సెల్లో నియాహన్‌లతో కలిసి పోర్న్‌ వీడియోలు చూస్తానని చెప్పింది.

ప్రస్తుత స్మార్ట్‌ యుగంలో పిల్లలను చెడు వ్యవసనాలబారిన పడకుండా చూడటం దాదాపు అసాధ్యమని, ఏది చేయవద్దని చెబితే అదే చేస్తారని, దొంగ చాటుగా అయినా అదే చేస్తారని, అందుకే వారలా చేయకుండా లైంగిక జీవితంపై అవగాహన కల్పించేందుకే వారితో కలిసి పోర్న్ చూస్తానని యూనీ తెలిపింది.

‘నా పిల్లలు శృంగారాన్ని ఓ బూతూలా కాకుండా.. ఓపెన్ మైండ్‌తో ఆలోచించాలని కోరుకుంటున్నా. అందుకే వారితో కలిసి పోర్న్ చూస్తా.

అందులో ఉండే చెడును వారికి వివరిస్తా. నేను మాత్రమే కాదు.. పిల్లలకు లైంగిక జీవితం పట్ల సరైన అవగాహన కల్పించడం తల్లిదండ్రులందరి బాధ్యత’ అని యునీ పేర్కొనడం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ విషయంపై కొంత మంది నెటిజన్లు.. ‘నీకేమైన బుద్ధుందా.. ఇదేం పైత్యం’ అంటూ.. తిట్టిపోస్తూంటే.. మరికొందరు ‘ఆమె చేస్తుంది సరైన పనే’ అంటూ యూని శరాను సపోర్ట్‌ చేస్తున్నారు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -