ఈ విశ్వంలో తల్లిదండ్రుల ప్రేమను మించింది మరొకటి లేదంటారు. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎన్నో కష్టాలను అనుభవించేందుకు కూడా సిద్ధపడతారు. వారిని ప్రయోజకులను చేయాలని, వారి ఆనందమే తమ ఆనందంగా భావిస్తారు. కానీ.. ఇప్పుడు చెప్పబోయే తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డను అమ్మేసుకున్నారు. అది కూడా ఓ సెకండ్ హ్యాండ్ కారును కొనుక్కోవాలనే కోరికతో. మీరు చదువుతోంది నిజమే. కేవలం ఓ సెకండ్ హ్యాండ్‌ను కొనుక్కోవాలనే ఆలోచనతో తమ నెలల చిన్నారిని విక్రమించేశారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
అది యూపీలోకి కన్నౌజ్ జిల్లా. ఆ ప్రాంతంలో తాజాగా జరిగిన ఓ ఘటన సంచలనం సృష్టించింది. తల్లిందండ్రులే కసాయి వారిగా మారి తమ మూడునెలల పసికందును రూ.1.5 లక్షలకు అమ్ముకున్నారు. ఈ డబ్బులతో ఓ సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కోవాలనేదే వారి ఆలోచన. ఇంట్లో పసికందు కనిపించకపోవడంతో తల్లిదండ్రులను నిలదీసిన చిన్నారి అమ్మమ్మ, తాతయ్యలకు నిజం తెలిసి షాకయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సదరు తల్లిదండ్రులను విచారించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికీ ఆ చిన్నారి కొనుగోలు చేసిన వ్యక్తి వద్దే ఉన్నట్లు కూడా తెలిసిందని చెప్పారు.
ఇన్స్‌పెక్టర్ శైలేంద్ర కుమార్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారి ఇంకా వ్యాపారస్తుడి వద్దే ఉంది. చిన్నారి తల్లిదండ్రులను పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారించారు. స్థానికంగా ో కుటుంబంలోని తల్లిదండ్రులు తమ బిడ్డను ఓ సెకండ్ హ్యాండ్ కారు కోసం రూ.1.5 లక్షలకు అమ్ముకున్నట్లు ఫిర్యాదు అందింది. వెంటనే విచారణ ప్రారంభించి వారిని అదుపులోకి తీసుకున్నారు.