Friday, November 1, 2024

14 యూఎఫ్‌ఓలు.. ఒక్క యుద్ధ విమానం..

యూఎఫ్‌ఓ(అన్‌ఐడెంటిఫైడ్‌ ఫ్లయింగ్‌ ఆబ్జెక్ట్‌).. పేరుకు తగ్గట్లే వీటికి సంబంధించిన సమాచారం ఏదీ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఎవరికీ తెలియదు. అందుకే యూఎఫ్‌వో గురించి ఏ విషయం బయటకొచ్చినా అంతా ఆసక్తిగా దానిని తెలుసుకుంటారు. ఇక ఈ మధ్య కలంలో యూఎఫ్‌వోలకు సంబంధించిన అనేక వీడియోలు కూడా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే చాలా మంది తాము యూఎఫ్ఓ‌లను చూశామని, అందులోనుంచి వచ్చిన ఏలియన్లు తమను ఎత్తుకు వెళ్లారని కూడా చెబుతుంటారు. కానీ ఆధారాలు లేకపోవడంతో వారి మాటలను చాలా మంది నమ్మరు. అయితే తాజాగా అమెరికన్ నేవీకి చిక్కిన ఓ వీడియో యూఎఫ్‌వోలు ఉన్నాయనే వాదనకు మరింత బలం చేకూరుస్తోంది.

కొద్ది రోజుల క్రితం యూఎస్‌ నేవీ యూఎఫ్‌ఓలకు సంబంధించి ఓ వీడియోను విడుదల చేసిదింది. 2019లో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు అమెరికన్‌ నేవీ వెల్లడించింది. ఈ క్రమంలో పరిశోధనాత్మక చిత్రాల దర్శకుడు జెరెమీ కోర్‌బెల్‌ అదే సంఘటనకు సంబంధించిన మరో వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ మతి పోయినంత పనవుతోంది. ఇందులో ఏకంగా 14 యూఎఫ్‌ఓలు ఉన్నాయి. ఇవి అమెరికన్‌ నేవీ యుద్ధ నౌక ఒమాహాను చుట్టుముట్టినట్లు కోర్‌బెల్‌ తెలిపాడు. వీటి వేగం గంటకు 70-250 కిలోమీటర్ల వరకు ఉందని.. ఒమాహాతో పోల్చితే 3 రెట్లు వేగవంతమైనవని కోర్‌బెల్‌ చెప్పుకొచ్చాడు. అంతేకాదు రాడార్‌ స్క్రీన్‌‌పై కూడా ఈ యూఎఫ్‌ఓలు కనిపించాచినట్లు కోర్‌బెల్‌ పేర్కొన్నారు.

కోర్‌బెల్‌ తెలిపిన మరిన్ని వివరాల ప్రకారం.. ఈ వీడియోను ఓడ కమాండ్ సెంటర్‌లో చిత్రీకరించారు. గతంలో అన్‌ఐడెంటిఫైడ్‌ ఏరియల్ ఫినామినా టాస్క్ ఫోర్స్(యూఏపీటీఎషఫ్‌) వద్ద ఉన్న ఫోటోలను కూడా కోర్‌బెల్ షేర్‌ చేశాడు. వీటిని అమెరికన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ డిఫెన్స్‌, పెంటగాన్ కూడా ధ్రువీకరించింది. ఈ యూఎఫ్‌వోల గురించి పెంటగాన్ ప్రతినిధి సుసాన్ గోఫ్ ఏప్రిల్‌లో ది బ్లాక్ వాల్ట్‌కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. యూఎఫ్‌వో సంఘటనలను యూఏపీటీఎఫ్‌ తమ కొనసాగుతున్న పరీశోధనలలో చేర్చిందని వెల్లడించారు. మే 15న కోర్‌బెల్ షేర్‌ చేసిన వీడియోలో, “గోళాకార” యూఎఫ్‌ఓ ఒకటి సముద్రంలో అదృశ్యమైనట్లు పెంటగాన్ మరోసారి ధ్రువీకరించింది. కోర్‌బెల్ గతంలో విడుదల చేసిన ఫుటేజ్‌ ప్రామాణికమైనదని.. టాస్క్ ఫోర్స్ యూఎఫ్‌ఓల కదలికలను పరిశీలిస్తున్నట్లు అమెరిక రక్షణ శాఖ వెల్లడించింది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x