‘జెట్టి’ సినిమాతో హీరోగా సుపరిచితులైన కృష్ణ మానినేని సేవా దృక్పథంతో ‘100 డ్రీమ్స్’ సేవా సంస్థ స్థాపించి, గత ఎనిమిది సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా విజయవాడ వరదల సమయంలో హీరో కృష్ణ మానినేని చేసిన సేవా కార్యక్రమాలు ప్రశంసలు అందుకున్నాయి. 100 డ్రీమ్స్ సేవా సంస్థ వ్యవస్థాపకులు కృష్ణ మానినేని.. జూన్ 14 ఇంటర్నేషనల్ బ్లడ్ డొనేషన్ డే ను పురస్కరించుకొని జూన్ 29వ తేదీన ‘సింధూర సంజీవని’ పేరిట నేడు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తదాన శిబిరం నిర్వహించి, 251 డోనర్స్‌తో రక్తదాన కార్యక్రమం దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమానికి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ కార్యక్రమంలో చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు స్వామి నాయుడు, 100 డ్రీమ్స్ వాలంటీర్స్ మెగాస్టార్ అండ్ పవర్ స్టార్ అభిమానులు, పంచ్ ప్రసాద్, జబర్దస్త్ రాముతో పాటు ఎం రవికుమార్, విజయ్ భాస్కర్, సత్యదేవ్, మహేష్ బాబు, బాలకృష్ణ, కిషోర్ కౌతారపు, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.






