ప్రతి ఒక్కరికీ సెంటిమెంట్‌లు ఉంటాయి. క్రికెట్‌లో ఇలాంటి సెంటిమెంట్‌లు మరింత పీక్ స్టేజ్‌లో ఉంటాయి. ఆటగాళ్లు, అభిమానులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ విచిత్రమైన సెంటిమెంట్‌లు ఉంటాయి. ఇక ఐపీఎల్ లాంటి హై టెన్షన్ టోర్నీ అంటే ఆ సెంటిమెంట్‌లు ఇక ఏ స్థాయిలో ఉంటాయో వేరే చెప్పక్కర్లేదు. అయితే మిగతా జట్లన్నింటినీ పక్కన పెడితే ముంబై ఇండియన్స్‌కు మాత్రం విచిత్రమైన సెంటిమెంట్ ఉంది. తొలి మ్యాచ్ ఓడిపోవడం, ఆ తరువాతి మ్యాచ్ గెలవడం.. చివర్లో ట్రోఫీ ఎత్తుకెళ్లిపోవడం. ఇదే ఆ జట్టుకున్న సెంటిమెంట్. విచిత్రంగా ఉన్నా.. గత 8 ఏళ్లుగా ముంబై ఇదే సెంటిమెంట్‌తో ట్రోఫీలు కొట్టేస్తోంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ముంబై 5 సార్లు ట్రోఫీ నెగ్గగా.. 3 సార్లు ఇదే సెంటిమెంట్ ఫాలో అయింది. ఇక ఈ సీజన్‌లో కూడా ముంబై అదే సెంటిమెంట్‌ను ఫాలో అయింది. తొలి మ్యాచ్ బెంగళూరుతో ఓడిపోయింది. ఆ తర్వాత కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో బౌలర్లు చేసిన మ్యాజిక్‌తో అద్భుత విజయం సాధించింది.
2019 సీజన్‌లో ఫస్ట్ మ్యాచ్ చెన్నై చేతిలో ముంబై ఓడింది. రెండో మ్యాచ్‌లో కోల్‌కతాపై గెలిచింది. ఇక 2020లో ఫస్ట్ మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడింది. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో బెంగళూరుపై గెలిచింది. ఈ రెండు సార్లుకూడా ట్రోఫీని అందుకుని ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు హ్యాట్రిక్‌పై కన్నేసింది. కాగా.. ఈ సీజన్లోనూ అదే సెంటిమెంట్ ఫాలో కావడంతో ట్రోఫీని సాధింస్తుందని అభిమానులు కచ్చితంగా చెబుతున్నారు.
An absolute thriller of a game here at The Chepauk. @mipaltan win by 10 runs to register their first win of #VIVOIPL 2021 season.
Scorecard – https://t.co/CIOV3NuFXY #KKRvMI #VIVOIPL pic.twitter.com/PJzQL2HPbJ
— IndianPremierLeague (@IPL) April 13, 2021
ఈ క్రమంలోనే సెంటిమెంట్ రిపీట్ కావడంతో ముంబై ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఐపీఎల్ 2021 ట్రోఫీ కూడా ముంబైదేనని అంటున్నారు. సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నారు. గత సీజన్ల(2019, 2020)లోనూ ముంబై ఇదే సెంటిమెంట్ ఫాలో అయిందని, ఆ రెండు టోర్నీల్లోనూ ముంబై జట్టే విజేతగా నిలిచిందని గుర్తు చేస్తున్నారు. ఐపీఎల్ 13 సీజన్లలో ముంబయి ఇండియన్స్ వరుసగా 2013, 2015, 2017, 2019, 2020లో టైటిల్ విజేతగా నిలిచింది. ఈ 5 సార్లు రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే ఆ జట్టు టోర్నీ విజేతగా నిలిచింది.