కరోనా విజృంభణను నియంత్రించేందుకు ఏకైక మార్గం వ్యాక్సినేషన్. దేని ద్వారానే ప్రజల్ని కోవిడ్ బారిన పడకుండా కాపాడగలమని ప్రపంచం మొత్తం నమ్ముతోంది. మన ఇండియా కూడా అదే విశ్వసిస్తోంది. ఈ క్రమంలోనే దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ప్రజలు కూడా వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు. అయితే వ్యాక్సిన్ వేయించుకోడానికి కూడా కొన్ని నిబంధనలున్నాయి. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకోవాలి. రెండింటికీ మధ్యన నెలరోజుల గ్యాప్ ఉండాలి. అది కూడా లోకే కంపెనీకి చెందిన వ్యాక్సిన్లు అయి ఉండాలి. అయితే తాజాగా ఓ 63ఏళ్ల వృద్ధురాలు రెండు వేర్వేరు వ్యాక్సిన్లకు చెందిన రెండు డోసుల వాక్సిన్ ను నిముషాల వ్యవధిలోనే రెంటినీ తీసుకుంది. దీంతో వైద్యాధికారులకు పెద్ద షాక్ తగిలింది. బీహార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాలలోకి వెళితే.. పాట్నాలోని పుపున్ బ్లాక్ టౌన్‌కు చెందిన సునీలా దేవి వ్యాక్సిన్ వేయించుకునేందుకు వ్యాక్సినేషన్ సెంటర్‌కు వచ్చింది. అక్కడ రెండు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేసి ఒక దగ్గర కోవాగ్జిన్, మరో దగ్గర కోవిషిల్డ్ టీకాలు వేస్తున్నారు. సునీలా దేవి మొదట ఒక లైన్లో నిల్చుని కోవాగ్జిన్ టీకా తీసుకుంది. అనంతరం మరో టీకా కూడా తీసుకోవాలేమో అనుకుని రెండో లైన్లో కూడా నిల్చుంది. నర్సులు ఎలాంటి ప్రశ్నలూ వేయకుండానే ఆమెకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ కూడా వేసేశారు.
కాగా.. విషయం తెలియడంతో జిల్లా ఆరోగ్య అధికారి.. సిబ్బందితో కలిసి ఆ మహిళ ఇంటికి వెళ్లారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంది. అయినప్పటికీ ఆమెను అబ్జర్వేషన్‌లో ఉంచారు. కాగా, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నర్సులకు హెల్త్ ఆఫీసర్ షోకాజ్ నోటీసులువ్ జారీ చేశారు. ఆమెను వైద్యులు ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉంచారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు వ్యాక్సినేషన్ సెంటర్ ముందు ధర్నా చేశారు.