Sunday, March 22, 2026

చీమల పుట్ట నువ్వు పెట్టావా.. నా కొడకా: ఈటల

ఎవరో పెట్టిన చీమల పుట్టలోకి ఈటెల వచ్చాడని ఒకరు అంటున్నారని, చీమల పుట్ట నేను పెట్టానా, నువ్వు పెట్టావా నా కొడకా..’ అంటూ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో తన విమర్శకులపై విరుచుకుపడ్డారు. కుల సంఘాల మీటింగులు పెట్టి, అంగట్లో మాదిరిగా అందరినీ టీఆరెస్ కొనుగోలు చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రజలు అంటున్నారని, అదే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని దెబ్బ తీస్తుందని ఈటల పేర్కొన్నారు.

ఐఏఎస్ లాంటి అధికారులను కూడా కేసీఆర్ బానిసలుగా చేసుకున్నారని ఆయన విమర్శించారు. అయితే తాము ఎవరి జోలికి వెళ్లబోమని, 20 ఏళ్లలో ఎప్పుడూ గొడవలకు తావు ఇవ్వలేదని ఈటల పేర్కొన్నారు. అయితే తనపై విమర్శలకు దిగితే మాత్రం ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే తనపై వరుసలు గుప్పిస్తున్న వారిపై ఈటల తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -