Thursday, November 21, 2024

పరీక్షలపై సుప్రీం నిర్ణయాన్ని గౌరవిస్తాం: మంత్రి ఆదిమూలపు

రాష్ట్రంలో పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరించినా దానిని పాటించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి అదిమూలపు సురేష్ అన్నారు. సుప్రీంకోర్టులో ఏపీ, కేరళ రాష్ట్రానికి సంబంధించి పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై వాదనలు జరిగిన విషయాన్ని మంత్రి సురేష్ ప్రస్తావించారు.

‘రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందనే మాటలో వాస్తవం లేదు. పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఏమిటని మాత్రమే సుప్రీంకోర్టు అడిగింది. దాంతో కోర్టుకు పరీక్షలు ఎలా నిర్వహిస్తామో స్పష్టంగా తెలియజేశాం. గదికి 15 మంది విద్యార్థులు ఉండేలా చర్యలు తీసుకుంటామని, విద్యార్థికి, విద్యార్థికి మధ్య 5 అడుగుల భౌతికదూరం పాటిస్తూ ఐసొలేషన్‌ రూమ్స్, కొవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పాం. ఎంసెట్ పరీక్షలకు సంబంధించి ఇంటర్ పరీక్షలను ఎలా పరిగణనలోకి తీసుకుంటామో కోర్టుకు వివరించాం. పదో తరగతిలో గ్రేడ్‌ల విషయంపైనా కోర్టుకు వివరించాం’ అంటూ మంత్రి తెలిపారు.

అంతేకాకుండా కేవలం గ్రేడ్‌లు మాత్రమే ఇస్తున్నామని, మార్కులు కాదని సుప్రీంకోర్టుకు తెలిపినట్లు మంత్రి చెప్పారు. ఈ వివరాలన్నింటిని అఫిడవిట్ ద్వారా తెలపాలని, విచారణను గురువారానికి వాయిదా వేస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపినట్లు వివరించారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x