రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న లోక్‌జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్‌ను సీఎం నితీశ్ కుమార్ అదును చూసి దెబ్బ కొట్టారు. ఏకంగా పార్టీ కకావికలమయ్యేలా, చిరాగ్‌కు ఏమీ అర్థం కాక నిర్ఘాంతపోయేలా ఆ దెబ్బ కొట్టారు. నితీశ్ దెబ్బకు ఏకంగా ఎల్జేపీ పార్టీనే చీలిపోతోంది. మేనమామ పశుపతి నాథ్ స్వయంగా దెబ్బ తీశారు. ఏకంగా ఐదుగురు ఎంపీలను తనవైపు తిప్పుకొన్నారు. దీంత యువనేత చిరాగ్‌కు లతి పెద్ద షాక్ తగిలినట్లైంది. చిరాజగ్ వద్ద మొత్తం ఆరుగురు ఎంపీలుండగా, ఐదుగురు తమను ప్రత్యేకంగా గుర్తించాలని లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం నితీశ్‌ను ఓ ఆటాడుకున్నారు చిరాగ్. మిత్రపక్షమైనా సరే… సీఎం నితీశ్‌పై రోజూ ఘాటైన విమర్శలు చేస్తూ టార్గెట్ చేసేవారు. అంతేకాకుండా ఏకంగా సీఎం నితీశ్‌కు వ్యతిరేకంగా తమ పార్టీ తరపున అభ్యర్థిని కూడా నిలబెట్టేశారు. ఇంత జరిగినా, సీఎం నితీశ్ అప్పట్లో కిమ్మనలేదు. అప్పటి కోపాన్ని సీఎం నితీశ్ ఇప్పుడు తీర్చుకుంటున్నారని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎల్జేపీ ఎంపీ, చిరాగ్ మేనమామ పశుపతినాథ్ ఇలా వ్యవహరించడం వెనుక సీఎం నితీశ్ హస్తం ఉందని కొందరు భావిస్తున్నారు. ఈ ఐదుగురు ఎంపీలతో ప్రత్యేక కుంపటి పెట్టడం వెనుక సీఎం నితీశ్ ఒక్కో ఎంపీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, తగు ప్రణాళికలను రూపొందించినట్లు సమాచారం. అందుకు తగ్గ నేతను కూడా ప్రత్యేకంగా నియమించారు నితీశ్. ముఖ్యమంత్రి నితీశ్ అప్పజెప్పిన పనిని ఆ నేత పూర్తి చేసేశారు. దీంతో ఎల్జేపీ కూటమి కకావికలమై కూర్చుంది. ఆ పని పూర్తి చేసిన జేడీయూ నేత పేరు మహేశ్వర్ హజారీ. ఈయన చిరాగ్ మేనమామైన పశుపతినాథ్ బంధువు. పశుపతి నాథ్ వ్యవహారాలన్నీ హజారీకి బాగా తెలుసు.
మేనల్లుడు చిరాగ్, మేనమామ పశుపతి మధ్య జరుగుతున్న ‘కోల్డ్‌వార్’ గురించి కూడా బాగా తెలుసు. పార్టీ ఎంపీలు చేజారి పోతున్నారని పసిగట్టిన చిరాగ్… మేనమామ ఇంటికి వెళ్లారు. గంట వేచిచూశారు. అయినా మేనమామ పశుపతినాథ్ చిరాగ్ పాశ్వాన్‌ను కలుసుకోలేదు. దీంతో చేసేదేమీ లేక చిరాగ్ వెనుదిరగాల్సి వచ్చింది. అప్పటికే చిరాగ్, పశుపతి మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది. ఈ వ్యవహారం మొత్తం హజారీకి తెలుసు. అందుకే సీఎం నితీశ్ ఆయనకు ఈ బాధ్యతను పురమాయించారు. మహేశ్వర్ హజారీ పని పూర్తి చేసిన మరుక్షణం నుంచే సీఎం నితీశ్ ఎంపీ పశుపతినాథ్‌తో టచ్‌లోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి సీఎం నితీశ్ ఆపరేషన్ ప్రారంభిచేశాను. సోమవారానికి పూర్తిచేశారని సమాచారం.