జింబాబ్వేతో జరిగిన టెస్టులో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అత్యంత అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఓ టెస్టులో అత్యధికంగా 99.2 ఓవర్లు వేసినన తొలి బౌలర్ చరిత్ర సృష్టించాడు. ఎప్పుడో 1998 ఆగస్టులో శ్రీలంక స్నిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఒక టెస్టులో 113.5 ఓవర్లు వేశాడు. ఆ తరువాత మళ్లీ ఇన్నాళ్లకు ఒక టెస్టులో ఓ బౌలర్ ఇన్ని ఓవర్లు వేయడం 22 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి.
ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ మొత్తం 11 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 36.3 ఓవర్లు వేసిన రషీద్.. రెండో ఇన్నింగ్స్‌లో 62.5 ఓవర్లు వేశాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో 138 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టిన రషీద్.. రెండో ఇన్నింగ్స్‌లో 137 పరుగులు ఇచ్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఫస్ట్ స్పెల్‌లో 20 ఓవర్లు వేశాడు. రషీద్ ఇప్పటివరకు 5 టెస్టుల్లో 34 వికెట్లు పడగొట్టాడు. అయితే వాటన్నింటిలోకీ ఈ మ్యాచ్‌లోనే రషీద్ తన కెరీర్‌లోనే అత్యత్తమ గణాంకాలను నమోదు చేశాడు. మొత్తం 104 పరుగులకు అతని 11 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
ఇదిలా ఉంటే ఓ టెస్టులో అత్యధికంగా 16 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా శ్రీలంక స్పిన్నర్ మురళీధరన్ పేరిట రికార్డు ఉంది. అత్యధిక ఓవర్లు విసిరిన రికార్డును ఇంగ్లాండ్‌కు చెందిన బాబీ పీల్ కలిగి ఉన్నాడు. 1985 జనవరిలో ఆస్ట్రేలియాతో మెల్బోర్న్‌లో జరిగిన టెస్ట్‌లో పీల్ ఏకంగా 146.1 ఓవర్లు విసిరాడు. 6 వికెట్లు పడగొట్టాడు