Sunday, March 22, 2026

వైరల్ అవుతున్న వార్నర్ బాలీవుడ్ సాంగ్.. ఈ సారి సిక్స్‌ప్యాక్‌తో..

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్, డాషింగ్ బ్యాట్స్‌మన్ వార్నర్‌ మరో సారి రచ్చ చేశాడు. సోషల్ మీడియా వేదికగా షర్ట్ విప్పి మరీ ఆలియా భట్‌తో డ్యాన్స్ చేశాడు. ఆశ్చర్యపోతున్నారా..? అయితే ఇదంతా ఒరిజినల్ కాదులెండి. టైగర్ ష్రాఫ్, ఆలియా కలిసి చేసిన స్టూడెంట్ ఆఫ్‌ది ఇయర్ 2 సినిమాలోని ‘హుక్ అప్’ పాటను వార్నర్ ఫేస్ శ్వాప్ చేశాడు. టైగర్ ష్రాఫ్ ముఖం వద్ద తన ముఖాన్ని శ్వాప్ చేసి, ఆ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అయితే ‘ఇదంతా నా అభిమానుల డిమాండ్‌ మేరకే’ అంటూ వార్నర్‌ ఆ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

వార్నర్ సాధారణంగానే సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. దానికి తోడు ఇండియా అన్నా, ఇండియన్ సాంగ్స్ అన్నా వార్నర్‌కు విపరీతమైన అభిమానం. దీంతో ఇక్కడి టాలీవుడ్, బాలీవుడ్ సాంగ్స్‌‌కు డాన్స్ చేస్తూ, డైలాగ్స్‌ చెబుతూ, సీన్స్‌‌ను రీమేక్ చేస్తూ అప్‌లోడ్ చేసి అభిమానులను అలరిస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా టైగర్‌ ష్రాప్‌ పాటతో ముందుకొచ్చాడు. ఇదంతా నా అభిమానుల డిమాండ్‌ మేరకే అంటూ వార్నర్‌ క్యాప్షన్‌ జతచేశాడు. ప్రస్తుతం వార్నర్‌ వీడియో ట్రెండింగ్‌లో ఉంది.

 

View this post on Instagram

 

A post shared by David Warner (@davidwarner31)


కాగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ కరోనా కారణంగా రద్దు కావడంతో స్వదేశానికి చేరుకున్న వార్నర్‌ 15 రోజుల పాటు సిడ్నీలోని హోటల్లో కఠిన క్వారంటైన్‌లో గడిపాడు. ఇటీవలే ఐసోలేషన్‌ పూర్తి చేసుకున్న ఆటగాళ్లు తమ కుటుంబసభ్యులను కలుసుకున్నారు. సుధీర్ఘ విరామం తర్వాత తమ కుటుంభసభ్యులను కలుసుకోవడంతో ఆటగాళ్లంతా ఎమెషన్‌కు గురయ్యారు. ఇక ఆస్ట్రేలియా జూలైలో విండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో విండీస్‌తో 5 టీ20, 3 వన్డేల్లో తలపడనుంది.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -