ముంబై: ఇండియాన్ ప్రీమియర్ లీగ్ 2021లో భాగంగా జరిగి రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించింది. 189 పరుగల లక్ష్యాన్ని కేవలం 19 ఓవర్లలోనే ఛేదించి రికార్డు సృష్టించింది. ప్రధానంగా ఢిల్లీ ఓపెనర్లు పృధ్వీ షా(72), శిఖర్ ధవన్(85) విజృంభించి ఆడడంతో ఢిల్లీ జట్టు భారీ లక్ష్యన్ని సులభంగా ఛేదించింది. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ చెన్నైకు బ్యాటింగ్ ఇచ్చింది. అయ్యర్ గైర్హాజరీలో తొలి సారిగా ఢిల్లీ జట్టుకు రిషబ్ పంత్ కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. అయితే ధోనీ ముందు పంత్ కెప్టెన్సీ నిలవలేదని చాలా మంది అనుకున్నా.. పంత్ కెప్టెన్సీలో ఇరగదీశాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు కేవలం 7 పరుగులకే 2 వికెట్లు కల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. అయితే మోయీన్ అలీ(36), సురేశ్ రైనా(54)లు జట్టును ఆదుకున్నారు. స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే వీరిద్దరూ అవుటైన తరువాత చెన్నై స్కోరు వేగం మందగించింది. కానీ, చివర్లో శామ్ కర్రాన్(34) సిక్సులు, ఫోర్లతో ధాటిగా ఆడడంతో చెన్నై జట్టు 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. మరికొద్ది సేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్ 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనుంది. అయితే చివర్లో చెన్నై ఆల్‌రౌండర్ శామ్ కర్రాన్(34) బౌండరీలతో విరచుకుపడడంతో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై జట్టు 188 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ ఓక్స్, ఆవేశ్ ఖాన్‌లు చెరో రెండు వికెట్లు తీగా.. రవిచంద్రన్ అశ్విన్, టామ్ కర్రాన్‌లు చెరో వికెట్ తీసుకున్నారు.
అనంతరం.. బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టుకు అదిరిపోయే ఓపెనింగ్ లభించింది. పృధ్వీ షా-శిఖర్ ధవన్ ధ్వయం అత్యధికంగా 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఢిల్లీ విజయం నల్లేరుపై నడకే అయింది. 72 పరుగల వద్ద పృధ్వీ షా అవుటైనా.. ఆ తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన ఆ తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్(7), ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్(14), షిమర్రన్ హెట్‌మెయిర్(0 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశారు. దీంతో కేవలం 18.4 ఓవర్లలోనే ఢిల్లీ 3 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసి సునాయాసంగా విజయం సాధించింది. మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ శిఖర్ ధవన్‌కు లభించింది.