Monday, March 23, 2026

వకీల్ సాబ్‌పై సూపర్ స్టార్ ప్రశంశలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం వకీల్ సాబ్. మూడు సంవత్సరాల విరామం తరువాత వచ్చినప్పటికీ పవన్ లో అదే రాజసం.. అదే పౌరుషం.. ఏమాత్రం తగ్గలేదు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై చిత్రీకరించిన ఈ చిత్రం అందరి ప్రశంశలు అందుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. కేవలం ప్రశంశలు మాత్రమే కాదు.. కలెక్షన్లు వర్షమే కురుస్తుంది. ఎంతమంది ఎన్ని ప్రయోగాలు చేసినా.. ఎన్ని ఎత్తుగడలు వేసినా, రాజకీయంగా ఎంత దెబ్బ కొట్టాలని చూసినా పవనిజం ముందు చిత్తూ అవ్వాల్సిందే అన్నట్లుగా సాగిపోతోంది.


అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి, మహేష్ బాబు వరకు అందరు ఈ సినిమాపై స్పందిస్తూనే ఉన్నారు. వారి అభిప్రాయాల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూనే ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రంపై స్పందిస్తూ… పవన్ కల్యాణ్ గారు ఫుల్ ఫామ్‌తో.. వకీల్ సాబ్‌గా పవర్ ప్యాక్‌డ్ అభినయాన్ని ప్రదర్శించారు.. ప్రకాష్ రాజ్ నటన అద్భుతం.. నివేతా థామస్, అంజలి, అనన్య నాగళ్ళలు మనసుకి హత్తుకునేలా నటించారు.. థమన్ మ్యూజిక్ హై స్థాయిలో ఉంది.. అందరికి ఆల్ ద బెస్ట్.. అంటూ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియ చేశారు.

తమ సినిమాపై ప్రశంశలు తెలియచేసిన మహేష్ బాబుకు ఎస్‌విసి సంస్థ ధన్యవాదాలు తెలిచేసింది.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -