Friday, November 1, 2024

వన్డే సిరీస్ కూడా మనదే.. ఇంగ్లండ్ వట్టిచేతులతోనే..

ప్రపంచ క్రికెట్‌లో టాప్ 2 జట్లు పోటీ పడుతుంటే ఆ మ్యాచ్ ఎలా ఉంటుంది..? కచ్చితంగా ఇంగ్లండ్-ఇండియా మధ్య జరిగిన మూడో వన్డేలా ఉంటుంది. మ్యాచ్ మొదట్లో సునాయాసంగా టీమిండియా గెలుస్తుందనిపించినా.. చివరి వరకు ఉత్కంఠ నెలకొంది. ఇంగ్లండ్ తరపున 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శామ్ కర్రాన్ టీమిండియాకు చెమటలు పట్టించాడు. విజయాన్ని సైతం ఏకంగా తమవైపు తిప్పుకున్నాడు. అయితే చివరి ఓవర్లో అతడిని టీమిండియా బౌలర్ నటరాజన్ అద్భుతంగా కట్టడి
చేశాడు. దీంతో టీమిండియా ఆఖరి బంతికి 7 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సిరీస్‌ను సైతం 2-1తో కైవసం చేసుకుంది.

కాగా.. 330 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు.. తొలి ఓవర్లోనే భువనేశ్వర్ బౌలింగ్‌లో జేసన్ రాయ్(14) వికెట్ కోల్పోయింది. అలాగే తొలి రెండు వన్డేల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన జానీ బెయిర్ స్టో ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో ఓపెనర్లను కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను అరంగేట్ర ఆటగాడు డేవిడ్ మలాన్(50), ఇన్నింగ్స్‌ను కాపాడాడు. కాగా.. రెండో వన్డేలో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన బెన్ స్టోక్స్(35) ఈ మ్యాచ్‌లో మాత్రం అంతగా రాణించలేదు. స్టోక్స్ వికెట్‌ను నటరాజన్ తీయగా.. మలాన్ వికెట్ ఠాకూర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత కెప్టెన్ జోస్ బట్లర్(15), లియామ్ లివింగ్‌స్టన్(36), మొయీన్ అలీ(29), ఆదిల్ రషీద్(19), మార్క్ ఉడ్(14), దారుణంగా విఫలమయ్యారు. కానీ 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శామ్ కర్రాన్(95 నాటౌట్) టీమిండియాకు చుక్కలు చూపించాడు. విజయాన్ని టీమిండియా నుంచి లాక్కున్నంత పనిచేశాడు. అయితే నటరాజన్ అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్‌ ఇండియా వశమైంది. ఈ విజయంతో ఇంగ్లండ్‌పై టెస్ట్, టీ20, వన్డే సిరీస్‌లు మూడింటినీ టీమిండియా గెలుచుకున్నట్లైంది. ఇక ఇంగ్లండ్ వట్టిచేతులతోనే స్వదేశం బయలుదేరింది.

ఇదిలా ఉంటే తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు మంచి ఓపెనింగ్ లభించింది. ఓపెనర్ శిఖర్ ధవన్(67: 56 బంతుల్లో 10 ఫోర్లు) అర్థ సెంచరీతో రాణించగా.. రోహిత్ శర్మ(37: 37 బంతుల్లో 6 ఫోర్లు) మళ్లీ భారీ స్కోరు అతడికి చక్కటి సహకారం అందించాడు. ఇక మొదటి రెండు వన్డేల్లో అర్థ సెంచరీతో రాణించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో కేవలం 7 పరుగులకే అవుటయ్యాడు. కానీ ఆ తర్వాత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్(78: 62 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఎప్పటిలానే అదే దూకుడుతో బౌండరీలతో దంచేశాడు. కానీ రెండో వన్డేలో సెంచరీతో మెరిసిన కేఎల్ రాహుల్(7) ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. కేఎల్ రాహుల్ తర్వాత హార్దిక్ పాండ్యా(64: 44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులు).. పంత్‌తో కలిసి స్కోరు బోర్డును వేగంగా తీసుకెళ్లారు.

వీరిద్దరు సునాయాసంగా బౌండరీలు బాదుతుంటే టీమిండియా స్కోరు 350 దాటేలా కనిపించింది. కానీ 3 ఓవర్ల తేడాలో వీరిద్దరూ అవుట్ కావడంతో టీమిండియా స్కోర్ వేగానికి బ్రేక్ పడినట్లైంది. అరంగేట్ర మ్యాచ్‌లోనే అర్థ సెంచరీతో అదరగొట్టిన కృనాల్ పాండ్యా(25: 34 బంతుల్లో) కనీసం ఒక్క బౌండరీ కూడా కొట్టేలేకపోయాడు. చివర్లో శార్దూల్ ఠాకూర్(30: 21 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులు) కొద్ది సేపు మెరుపులు మెరిపించడంతో జట్టు స్కోరు మూడొందలు దాటింది. అయితే మార్క్ వుడ్ వేసిన ఓ ఫాస్టెస్ట్ డెలివరీని భారీ షాట్ ఆడబోయాడు. కానీ బంతి బ్యాట్‌కు తాకి నేరుగా కీపర్ బట్లర్‌ చేతుల్లోకి వెళ్లింది. ఇక మిగతా బ్యాట్స్‌మెన్ కూడా వెంటవెంటనే అవుట్ కావడంతో 48.2 ఓవర్లలోనే 329 పరుగులకు టీమిండియా ఆలౌటైంది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x