ఎప్పటిలానే రష్యాలోని వ్లాదివోస్తోక్ విమానాశ్రయం ప్రయాణికులతో రద్దీగా ఉంది. అక్కడినుంచి ఓ విమానం టోల్మచావో ప్రాంతానికి బయలుదేరింది. అయితే ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఓ మహిళ పైకి లేచి ఉన్నట్లుండి దుస్తులను ఒక్కొక్కటిగా విప్పేయసాగింది. దీంతో ప్రయాణికులు కంగారు పడిపోయారు. వెంటనే అక్కడి సిబ్బందికి తెలియజేశారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న సిబ్బంది.. అయితే మాదకద్రవ్యాల దెబ్బకు ఆమె మౌండ్ కోల్పోయింది. అదుపు కోల్పోయిన ఆమె వారిని పట్టించుకోలేదు. దీంతో తోటి సిబ్బంది ఆమెను అక్కడే సీటుకు కట్టేశారు. టోల్మచోవ్ చేరేవరకు ఆమెను అలానే ఉంచారు.
‘ఫ్లైట్ టైకాఫ్ అయ్యాక ఆమె ఉన్నట్లుండి తన దుస్తులు విప్పేయడం ప్రారంభించింది. ప్రయాణికులు కంగారుగా కేకలేయడంతో అక్కడకు చేరుకున్నాం. అలా చూసి మొదట షాకయినా.. ఆమె డ్రగ్స్ మత్తులో ఉందని అర్థమై.. వెంటనే ఆమెను సీటుకు కట్టేశాం. ఎలా అదుపు చేయాలో తెలియకే అలా చేశాం. విమానం ల్యాండయ్యేవరకూ అలాగే ఉంచి కదలకుండా చూసుకున్నాం. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకూడదనే ఆ నిర్ణయం తీసుకున్నామ’ని సిబ్బంది తెలిపారు. విమానం టోల్మచావో విమానాశ్రయంలో దిగాక అక్కడి అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉంటే ఆమెను టోల్మచోవ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. తాను మత్తుపదార్థం తీసుకున్నట్టు సదరు మహిళ పోలీసు విచారణలో అంగీకరించింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.