గాయం కారణంగా ఐపీఎల్ 2021కు పూర్తిగా దూరమైన అయ్యర్ కొత్త కెప్టెన్‌పై రిషబ్ పంత్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడి కెప్టెన్సీకి సరైన సమర్థుడని కొనియాడాడు. ఈ మేరకు గురువారం తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఐపీఎల్ 2021లో పంత్ కెప్టెన్సీ వహించడం గొప్ప విషయమని అయ్యర్ అన్నాడు. రిషబ్ పంత్ కెప్టెన్‌గా రాణించగలడని, అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పాడు.
‘నేను భుజం గాయం కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో ఈ ఏడాది ఐపీఎల్‌కు జట్టును నడిపించే సత్తా ఉన్న ఆటగాడు కావలసి వచ్చింది. ఆ సత్తా పంత్‌కు ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. పంత్ కెప్టెన్సీపై నాకు ఎలాంటి సందేహం లేదు. అతడు కచ్చితంగా గొప్పగా రాణిస్తాడు. అతడు కెప్టెన్‌గా అదరగొట్టాలని, అద్భుతాలు సృష్టించాలని ఆశిస్తున్నా’ అంటూ అయ్యర్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. అలాగే ఈ ఏడాది ఐపీఎల్‌ను తాను చాలా మిస్ అవుతున్నానని, అయితే తన జట్టు కోసం మైదానం బయటి నుంచే వారిని ఉత్సాహపరుస్తానని అయ్యర్ చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ గాయం కారణంగా ఆ సిరీస్‌లో మిగతా రెండు వన్డేలకు దూరం కావడమే కాకుండా ఈ ఏడాది ఐపీఎల్ నుంచి కూడా వైదొలిగాడు. అయ్యర్ గాయం చాలా తీవ్రమైందని, శస్త్ర చికిత్స అవరసమని, ఆ తర్వాత కూడా కనీసం 5 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. దీంతో అయ్యర్ ఐపీఎల్‌కు మాత్రమే కాకుండా ఆ తర్వాత ఇంగ్లండ్, సౌత్‌ఆప్రికా సిరీస్‌లకు కూడా దూరం కానున్నాడు.