Thursday, November 21, 2024

ఐపీఎల్ లో ఈ క్యాచ్ లు అద్భుతం.. పట్టిన ఆణిముత్యాలు ఎవరంటే..!

క్యాచెస్ విన్స్ మ్యాచెస్.. ఈ నానుడి క్రికెట్ లో ఎప్పటి నుంచో ఉంది. ఎన్నో మ్యాచ్ లలో ఇది నిజం కూడా అయింది. ఒక్కో క్యాచ్.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన సందర్భాలున్నాయి. ఇక ఐపీఎల్ అంటేనే ఇలాంటి క్యాచ్ లకు పెట్టింది పేరు. మరికొద్ది రోజుల్లో ప్రారంభం ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టోర్నీ చరిత్రలో అద్భుతమైన క్యాచ్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2010లో ఫిరోజ్‌ షా కోట్ల (ప్రస్తుతం అరుణ్ జైట్లీ) స్టేడియం వేదికగా ఢిల్లీ, కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్‌లో డేవిడ్‌ హస్సీ అద్భుతమైన రీతిలో క్యాచ్‌ అందుకున్నాడు. కోల్‌కతా బౌలర్‌ చార్ల్‌ లాంగ్‌వెల్డ్‌ వేసిన బంతిని.. ఢిల్లీ బ్యాట్స్‌మన్ కాలింగ్‌వుడ్‌ లాంగ్‌ ఆన్‌ మీదుగా భారీ షాట్‌ ఆడాడు. అంతా అది సిక్స్ అనుకున్నారు. అయితే లాంగ్‌ ఆన్‌లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న డేవిడ్‌ హస్సీ.. ఎవరూ ఊహించని విధంగా దానిని క్యాచ్ పట్టేశాడు. అయితే బౌండరీ లైన్ దాటే ప్రమాదం ఉండదంతంతో బంతిని గాలికి విసిరి బౌండరీ లోపలికెళ్లి మళ్లీ బయటకొచ్చి దానిని అందుకున్నాడు. ఈ క్యాచ్‌ ‘బెస్ట్ క్యాచ్‌ ఆఫ్ ద సీజన్‌’ అవార్డును గెలుచుకుంది.

2014లో షార్జా వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాయల్ ఛాలెంజర్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. చివరి మూడు బంతుల్లో 6 పరుగులు చేస్తే బెంగళూరు గెలిచినట్లే. వినయ్‌కుమార్‌ వేసిన నాలుగో బంతిని బ్యాట్స్‌మెన్‌ ఏబీ డివిలియర్స్‌ బలంగా బాదాడు. గాల్లోకి లేచిన సిక్స్ అని, బెంగళూరు గెలిచేసిందని అంతా అనుకున్నారు. కానీ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న క్రిస్‌ లిన్‌.. అనూహ్య రీతిలో దానిని క్యాచ్ అందుకుని కిందపడ్డాడు. అతడు బౌండరీ లైన్ కు కొద్ది అంగుళాల దూరంలో తనను తాను నియంత్రించుకోవడంతో మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. చివరికి 2 పరుగుల తేడాతో కోల్‌కతా విజయం సాధించింది.

చిన్నస్వామి స్టేడియం వేదికగా 2018లో ఢీల్లి, బెంగళూరు జట్ల మధ్య లీగ్‌ మ్యాచ్‌ అది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ 175 పరుగులు చేసింది. బెంగళూరు ఇన్నింగ్స్‌లో 11 ఓవర్‌ వేసిన హర్షల్‌ పటేల్‌ చివరి బంతిని పుల్‌టాస్‌గా వేశాడు. దీన్ని కోహ్లీ బలంగా బాదాడు. అది మిడ్ వికెట్‌ మీదుగా బౌండరీ లైన్‌ వైపు దూసుకొచ్చింది. అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న ట్రెంట్‌ బౌల్ట్‌ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి ఎడమ చేత్తో దానిని అందుకున్నాడు. కొన్ని ఇంచుల దూరంలోనే ఉన్న బౌండరీ లైన్‌కు శరీరాన్ని తాకకుండా నియంత్రించుకుని ఓ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. బౌల్ట్ క్యాచ్ అందుకున్న తీరుతో కోహ్లీ కూడా షాకయ్యాడు.

ముంబై ఇండియన్స్ జట్టులో మేటి ఫీల్డర్లలో విండీస్ స్టార్ కిరణ్ పొలార్డ్ ఒకడు. పొలార్డ్‌ తన కెరీర్‌లో అద్భుతమైన క్యాచులు ఎన్నో అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. 2019లో వాంఖడే స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌లో కూడా పొలార్డ్ అలాంటి క్యాచ్ ఒకటి ఒడిసిపట్టాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబయి..170 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన చెన్నై 33 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. జేసన్ బెహ్రెండార్ఫ్ వేసిన ఐదో ఓవర్‌లో అప్పటికే రెండు ఫోర్లు బాది ఊపుమీదున్న సురేశ్‌ రైనా.. ఈ ఓవర్‌లో చివరి బంతిని డీప్‌ పాయింట్ మీదుగా ఆడాడు. బౌండరీ లైన్‌కు కొన్ని మీటర్ల దూరంలో ఉన్న పొలార్డ్‌.. అక్కడి నుంచి కదలకుండానే గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ పట్టేశాడు. ఈ క్యాచ్ ‘బెస్ట్ క్యాచ్‌‌ ఆఫ్ ద సీజన్‌‌’ అవార్డును సైతం సాధించింది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x