Wednesday, January 22, 2025

పంత్ రనౌట్.. రాజస్థాన్ బౌలర్ డాన్స్ వైరల్

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో మరో ఉత్కంఠ భరిత మ్యాచ్ అభిమానులకు క్రికెట్ ఆకలి తీర్చింది. రాజస్థాన్ రాయల్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ బౌలర్ల ముందు ఢిల్లీ తలొంచింది. రాజస్థాన్ రాయల్స్ అనూహ్య విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీని రాజస్థాన్ బౌలర్లు కట్టడి చేశారు. ఆ తర్వాత ఢిల్లీ బౌలర్లు కూడా రాజస్థాన్‌ను భారీ దెబ్బ తీశారు. అయితే చివర్లో డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్ ఢిల్లీ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. బౌండరీలతో చెలరేగి మ్యాచ్‌లో జట్టును గెలిపించారు.

మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు కేవలం 147 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ అర్థసెంచరీతో మెరిసినా.. అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. 32 బంతుల్లో 51 పరుగులు చేసిన పంత్‌.. అనూహ్యంగా రియాన్‌ పరాగ్‌ వేసిన అద్భుత త్రోకు రనౌట్‌ అయ్యాడు. ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌ 4వ బంతిని పంత్‌ లెగ్‌ సైడ్‌ దిశగా ఆడాడు. అయితే అక్కడ సింగిల్‌ తీసే అవకాశం లేకున్నా పంత్‌ అనవసర ప్రయత్నం చేశాడు. దీంతో పరాగ్‌ వేగంగా స్పందించి నేరుగా వికెట్ల వైపు విసిరాడు. ఆ బంతి డైరెక్ట్‌‌గా వికెట్లను గిరాటేయడంతో పంత్ అవుటయ్యాడు. అయితే పంత్‌ను అవుట్ చేసిన ఆనందంలో పరాగ్‌ డ్యాన్స్‌ చేయడం ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది. సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఈ వీడియోను విపరీతంగా వైరల్‌ చేస్తున్నారు.


ఇదిలా ఉంటే.. పంత్‌ మినహా మిగతావారెవరు చెప్పుకోదగ్గ స్కోరు చేయకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌ 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. రాజస్తాన్‌ బౌలర్లలో ఉనాద్కట్‌ 3, ముస్తాఫిజుర్‌ 2, మోరిస్‌ ఒక వికెట్‌ తీశాడు. ఇక 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్.. ఢిల్లీ బౌలర్ల ధాటికి విలవిల్లాడిపోయింది. వీరి ధాటికి రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ అందరూ వచ్చినట్లే వచ్చి పెవిలియన్‌కు క్యూ కట్టారు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఓపెనర్లు జోస్ బట్లర్(2), మనన్ వోహ్రా(9)ల వికెట్లు తీసి ఆదిలోనే దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత కెప్టెన్ సంజూ శాంసన్ (4), శివమ్ దూబే (2), రియాన్ పరాగ్ (2) కూడా సింగిల్ డిజిట్ స్కోర్లకే అవుట్ అయిపోయారు. దీంతో జట్టు 42 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ (43 బంతుల్లో 62), రాహుల్ తెవాటియా (19) వీరిద్దరూ అవుట్ కావడంతో మళ్లీ విజయం రెండు జట్లతో దోబూచులాడింది. చివర్లో క్రిస్ మోరిస్ 18 బంతుల్లో 4 సిక్సర్లతో 36 పరుగులు చేసి చేయడంతో రాజస్థాన్ విజయం దక్కించుకుంది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x