Wednesday, January 22, 2025

వామ్మో..! స్కై.. భార్యంటే ఎంత ప్రేమ నీకు..?

క్రికెటర్లందరూ తమ భార్యలను ఎంత ప్రేమిస్తారో వేరే చెప్పక్కర్లేదు. వారి ప్రేమను అనేకసార్లు బహిరంగంగానే వారు ప్రకటిస్తుంటారు. తాజాగా ముంబై ఇండియన్స్ టాపార్డర్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ కూడా తన భార్య దేవిషా శెట్టిని బహిరంగంగా ముద్దు పెట్టుకుని తన ప్రేమను చాటుకున్నాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఘన విజయం సాధించింది. రెండు వరుస పరాజయాల తర్వాత రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. దీంతో రోహిత్‌ సేన మ్యాచ్ అనంతరం సంబరాలు చేసుకుంది.

ఈ క్రమంలోనే సూర్యకుమార్‌ యాదవ్‌ తన సంతోషాన్ని భార్య దేవిషా శెట్టితో పంచుకున్నాడు. ఆట ముగియగానే స్టేడియంలో ఉన్న దేవిష ఒక్కసారిగా విండో వద్దకు రాగానే.. అక్కడే ఉన్న స్కై.. వెంటనే ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య ఓ పలుచటి గాజుతెర ఉన్నా.. అతడు ఆత్మీయంగా ముద్దు పెట్టుకుంటున్న సమయంలో ఫోటో క్లిక్ మనిపించడంతో ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను టీమిండియా మాజీ క్రికెటర్‌, ముంబై ఇండియన్స్‌ క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జహీర్‌ ఖాన్‌ సతీమణి, నటి సాగరిక ఘట్కే తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేశారు.

దీంతో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్న ఈ ఫోటో చూసిన నెటిజన్లు సూర్యకుమార్ యాదవ్‌పై తెగ కామెంట్లు చేస్తున్నారు. ‘వామ్మో.. స్కై! భార్యంటే ఎంత ప్రేమ నీకు..?’ అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే ‘స్కై తన ఆనందాన్ని భార్యతో పంచుకోవడం ముచ్చటగా అనించింది. వారిద్దరి జోడీ ఎప్పుడూ స్పెషలే..’ అని రిప్లైలు ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. క్వింటన్‌ డికాక్‌(70 నాటౌట్) అద్భుతమైన అర్థ సెంచరీతో ఆకట్టుకోగా, కృనాల్‌ పాండ్యా(39) మెరుగ్గా రాణించాడు. ఈ మ్యాచ్‌లో వన్ డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌.. 10 బంతులు ఎదుర్కొని 3 ఫోర్ల సాయంతో 16 పరుగులు చేశాడు. విజయానికి తన వంతుగా కొంత బాధ్యత నిర్వర్తించాడు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x