Wednesday, January 22, 2025

ప్రత్యర్థులను మట్టి కరిపిస్తూ ముందుకెళుతున్న స్టాలిన్.. డీఎంకేదే అధికారం..?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ మున్నేట్ర కళగం పార్టీ భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. ప్రత్యర్థి పార్టీలను మట్టి కరిపిస్తూ ఎదురు లేకుండా దూసుకుపోతోంది. ఈ ఫలితాలను బట్టి చూస్తుంటే ఈ సారి అధికారం కచ్చితంగా స్టాలిన్ పార్టదేననే సంకేతాలు వస్తున్నాయి. తమిళనాడులో ప్రజలు సాధారణంగా ప్రాంతీయతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికలల్లో స్టాలిన్ పార్టీ భారీ మెజారిటీ దిశగా అడుగులు వేస్తోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు వచ్చిన ఫలితాలను చూస్తే మొత్తం 234 స్థానాల్లో డీఎంకే ఏకంగా 130 పైగా సీట్లలో డీఎంకే మందుంజలో ఉండగా.. 86 స్థానాల్లో అన్నాడీఎంకే ముందుంది. ఇక బీజేపీ కేవలం 4 స్థానాల్లో మాత్రమే ముందుంది. ఇక కాంగ్రెస్ 13 స్థానాల్లో ముందుంది. వీరితో పాటు తొలిసారిగా ఎన్నికల బరిలో నిలబడిన సినీనటుడు కమల్ హాసన్ పార్టీ ఎంఎన్ఎం స్థానంలో ముందుంది.

ఇదే సమయంలో అన్నాడీఎంకే పార్టీ భాజాపాతో చేతులు కలపడంతో ప్రజలు ఆ పార్టీని ఆదరించలేదనే వార్తలు వస్తున్నాయి. దానికి తోడు అన్నాడీఎంకే పార్టీకి సరైన నాయకత్వం లేకపోవడం, మాజీ సీఎం అమ్మ(జయలలిత) మరణం తరువాత ఆ పార్టీ రెండుగా చీలిపోయి నానా రచ్చ చేసింది. ఆ తరువాత పళనిస్వామి, పన్నీర్‌సెల్వంల మధ్య సీటు కోసం యుద్ధమే జరిగింది. అయితే చివరికి ఎలాగోలా పళనిస్వామి ముఖ్యమంత్రిగా ఎన్నికవడంతో పన్నీర్ సెల్వం పార్టీలో సమాన నాయకుడిగా నిలిచిపోయారు.

దీంతో ఈ సారి కూడా వారిని గెలిపిస్తే ఎలాంటి పరిస్థితులు వస్తాయోననే ఆలోచన కూడా ప్రజల్లో కనిపించినట్లు అనిపిస్తోంది. దానికి తోడు తమిళనాడులో ఎప్పుడూ ప్రజలు అధికార పార్టీని ఓడిస్తుంటారు. ఐదేళ్ల అధికారం పూర్తవగానే నేలకు దించుతుంటారు. ఇది తరతరాలుగా జరుగుతోంది. ఈ క్రమంలోనే అన్నాడీఎంకే అధికారం కోల్పోబోతోందని కూడా విశ్లేషణలు వస్తున్నాయి. అయితే ఉత్తరభారత వ్యతిరేకత, హిందీ వ్యతిరేకత నేపథ్యంలోనే డీఎంకే విజయం సాధించబోతోందనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x