– త్వరగా స్వదేశానికి వచ్చేయాలని, అందుకోసం ప్రస్తుతం అందుబాటులో విమానాలకు టికెట్లను బుక్ చేసుకోమంటు త్వరపెడుతుంది. అంతేకాకుండా తమ దేశంలో ఉన్న వారిని కూడా ఎటువంటి పరిస్థితుల్లో భారత్‌కు ప్రయణం కావద్దని హెచ్చరించింది.
భారత్ నుంచి విమాన రాకపోకలను పలు దేశాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ దేశాల జాబితాలో అమెరికా కూడా ఒకటి. అయితే ఇప్పటికీ ప్రతి వారం భారత్ నుంచి అమెరికాకు విమానాలు ఉన్నాయని వీటిని యునైటెడ్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఇండియా వారు నడుపుతున్నారని ఆరోగ్య శాఖ వారు తెలిపారు. అంతేకాకుండా మరికొన్ని దేశాలకు అదనపు విమానాల సౌకర్యం కూడా ఉందని అధికారులు చెప్పారు. అయితే ఎవరైతే భారత్ నుంచి తమ స్వదేశానికి తిరిగి వెళ్లాలనుకుంటున్నారో వారు తమ సమీపంలోని ఎయిర్‌లైన్స్ కార్యాలయంలో తమ టికెట్లను నమోదు చేసుకోవచ్చని కూడా అధికారులు ప్రకటించారు.
అయితే భారత్ నుంచి అమెరికాకు ప్రయాణం చేస్తున్నవారు కచ్చితంగా కరోనా పరీక్ష చేయించుకుని ఆ ఫలితాలను చూపాలని తెలిపారు. అంతేకాకుండా ఈ కరోనా పరీక్ష ప్రయాణిస్తున్న తారీకుకు మూడు రోజులలోపే చేయించుకోవాలని చెప్పారు. అంతేకాకుండా ఇది వరకే కరోనా బారిన పడిన వారు మాత్రం వారికి పూర్తిగా కరోనా నయం అయినట్లుగా డాక్టర్ ఇచ్చే సర్టిఫికెట్ చూపించాలి. దాంతో పాటుగా అమెరికాకు చేరుకున్నాక పోస్ట్-ట్రావెల్ నిబంధనలను పాటించాల్సి ఉంది.
తాజాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగి పోవడంతో అమెరికా తన ప్రయాణ నిబంధనలను తిరిగి ప్రవేశపెట్టింది. దాంతో భారత్‌లో ఉన్న అమెరికన్లందరినీ తిరిగి స్వదేశానికి వచ్చేయాలని అమెరికా కోరింది. అంతేకాకుండా భారత్‌లో కరోనా విలయ తాండవం చేస్తుందని, దాంతో దేశంలో ఉగ్రవాదం, నేరాలు పెరిగిపోయాయని, అందుకనే భారత్ కఠిన చర్యలు తీసుకుంటుందని అమెరికా తన డాక్యుమెంటులో తెలిపింది.
ఇందులో భాగంగా ఏప్రిల్ 28న అమెరికా ఉద్యోగుల కుటుంభ సభ్యులు తిరిగి అమెరికాకు వెళ్లేందుకు వీలు కలిపించింది. ఈనెల 5న అమెరికా ఉద్యోగులను తమ స్వదేశానికి వెల్లేందుకు అనుమతిచ్చింది. అలాగే అమెరికాకు తిరిగి వెళ్లాలనుకునే అమెరికా పౌరులు దేశంలో ఉన్న కమర్షియల్ ట్రాన్స్‌పోర్టును వినియోగించుకోవచ్చని తెలిపింది.