కోవిడ్-19 నేపథ్యంలో ఆయా దేశాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇతర దేశాల నుంచి వచ్చే వారు తప్పని సరిగా వ్యాక్సిన్ పాస్ పోర్ట్ కలిగి ఉండాలి. ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకుంటారో వారు సంబంధింత వివరాల్ని అధికారిక పాస్ పోర్ట్ వెబ్ సైట్లలో నమోదు చేసుకోవాలి. అలా ఎవరైతే పాస్ పోర్ట్ వెబ్ సైట్లో నమోదు చేసుకుంటారో వారికి ఆయా దేశాల పాస్ పోర్ట్ అధికారులు వ్యాక్సిన్ డీటెయిల్స్‌తో సర్టిఫికెట్స్‌ను అందిస్తారు. ఈ సర్టిఫికెట్ ఉంటేనే విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది.
అయితే ఈ వ్యాక్సిన్ పాస్‌పోర్టును 2021 ఫిబ్రవరిలో తొలిసారి ఇజ్రాయెల్ దేశం ఈ వ్యాక్సినేషన్ పాస్ పోర్ట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎవరి దగ్గర ఈ వ్యాక్సిన్ పాస్ పోర్ట్ ఉంటే వాళ్లు మాత్రమే ఇజ్రాయెల్ దేశంలో ఉండేందుకు అనుమతిస్తామని ప్రకటించింది. ఇజ్రాయెల్ బాటలో మరికొన్ని దేశాలు ఈ వ్యాక్సిన్ పాస్ పోర్ట్‌ను అందుబాటులోకి తెచ్చాయి.
కాగా.. ఈ వ్యాక్సిన్ పాస్‌పోర్టును భారత్ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్దన్ మీడియాతో మాట్లాడుతూ.. మరికొద్దిరోజుల్లో జరగాల్సి ఉన్న జీ-7 సమ్మిట్ నేపథ్యంలో ముందుగా నిర్వహించిన ఆయా దేశాల ఆరోగ్యశాఖ మంత్రుల వీడియో కాన్ఫరెన్స్‌లో హర్షవర్దన్ ఈ వ్యాక్సిన్ పాస్ పోర్ట్ అంశాన్ని ప్రస్తావించారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు హర్ష వర్ధన్ ప్రకటించారు. వ్యాక్సిన్ పాస్ పోర్ట్ ఇవ్వడం దేశాలపట్ల వివక్షత చూపినట్లే అవుతుందని ధ్వజమెత్తారు.
దీంతో పాటు అభివృద్ధి చెందిన దేశాలకు కంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యాక్సినేషన్ తక్కువగా ఉండడం, సంబంధిత సమస్యలను పరిష్కరించడం, వ్యాక్సినేషన్, వ్యాక్సిన్ల సరఫరా, పంపిణీలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని హర్షవర్దన్ అన్నారు. ఇక వ్యాక్సిన్ పాస్ పోర్ట్ అమలు అంటే దేశాల పట్ల వివక్షత చూపినట్లేనని, ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రతికూలంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు.