Wednesday, January 22, 2025

‘ఈ వంద తీసుకుని గడ్డం గీసుకోండి సార్’ మోదీకి టీ వ్యాపారి షాక్

ఓ టీ వ్యాపారి ప్రధాని నరేంద్ర మోదీకి రూ.100 పంపాడు. అయితే ఇదేదో పీఎం కేర్స్ ఫండ్‌కు పంపాడని, ప్రజలకు సాయం చేసేందుకు అందించాడని అనుకోకండి. ఆయన నేరుగా ప్రధానికే ఈ రూ.100ను పంపాడు. ఇంతకీ ఆ మొత్తాన్ని ఎందుకు పంపాడో తెలుసా..? గెడ్డం గీసుకోమని. మీరు చదివింది కరెక్టే. మోదీ పెంచుతున్న గడ్డం గీసుకోవడానికే ఈ వంద రూపాయలు పంపుతున్నట్లు సదరు టీ వ్యాపారి చెప్పాడు. ఈ విషయాన్ని కూడా అతడు ఓ లేఖలో రాసి ఆ లేఖను కూడా మోదీకి పంపాడు.

మహారాష్ట్రలోని బారామతిలో అనిల్ మోరే అనే టీ వ్యాపారి స్థానిక ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఎదురుగా టీ స్టాల్ నడుపుతున్నాడు. కరోనా మహమ్మారి కారణంగా గత 15 నెలలుగా అతడు నానా అవస్థలు పడుతున్నాడు. ఈ క్రమంలోనే దేశంలోని అసంఘటిత కార్మికుల ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే అనిల్ మోరే.. ప్రధానికి తన అసంతృప్తి గళాన్ని వినిపిస్తూ ఓ లేఖను, రూ.100ను పంపాడు.

‘నాకు మన దేశ ప్రధాని అంటే ఎంతో గౌరవం, అభిమానం. నేను దాచుకున్న డబ్బుల్లో నుంచి ఆయనకు రూ.100 పంపుతున్నాను. దానితో ఆయన గెడ్డం గీయించుకోవాలి. ఆయన ఈ దేశ అత్యున్నత నాయకుడు. ఆయనను అవమానించడం, బాధపెట్టడం నా ఉద్దేశం కాదు. మహమ్మారి కారణంగా రోజు రోజుకు ఈ దేశ పేదలు పడుతున్న ఇబ్బందులను ఆయనకు తెలియజేయాలనుకుంటున్నా. ఆయన దృష్టిని ఆకర్షించేందుకే ఈ మార్గం ఎంచుకున్నాను. మోదీ ఆ గడ్డం తీసేసి.. ఇకపై ఏదైనా పెంచాలనుకుంటే, అది ఈ దేశ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేది అయి ఉండాలి. దేశ జనాభాకు వీలైనంత వేగంగా టీకాలు వేయిండానికి, వైద్య సదుపాయాలను పెంచడానికి ఆయన ప్రయత్నాలు చేయాల`ని మోరే తన లేఖలో పేర్కొన్నాడు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x