Saturday, April 5, 2025

లాక్ డౌన్ ఎత్తేసిన తెలంగాణ సర్కార్.. ఎప్పటినుంచంటే

తెలంగాణ‌లో లాక్ డౌన్‌ను పూర్తిగా ఎత్తేసింది రాష్ట్ర సర్కారు. రేపటి నుంచి అన్ని కార్యకలాపాలూ మునుపటిలా నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు నేడు నిర్వహించిన అత్యవసర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని ప్రభుత్వానికి నివేదికలు అందాయి. వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్.. లాక్ డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ నిబంధనలన్నింటినీ తీసివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది. కేబినెట్ నిర్ణయాలన్నీ ఆదివారం నుంచి అమల్లోకి రానున్నాయి.

ప్రజా జీవనం, సామాన్యుల బతుకుదెరువు దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే లాక్ డౌన్ ఎత్తేసినట్లు రాష్ట్ర కేబినెట్ వెల్లడించింది. తమ నిర్ణయానికి ప్రజల సహకారం కావాలని కోరింది.

అయితే లాక్ డౌన్ ఎత్తివేసినా కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని, తప్పని సరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం.. తదితర  కరోనా స్వీయ నియంత్రణ విధానాలను విధిగా పాటించాలని, ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలని స్పష్టం చేసింది.

కాగా.. కరోనా కేసులు విజృంభించడంతో తొలుత మే 14 నుంచి 20 వరకు లాక్‌డౌన్ ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నాలుగు గంటల పాటు లాక్‌డౌన్ సడలింపు ఇవ్వగా… ఆ తర్వాత మే 21 నుంచి 31 వరకు మరోసారి లాక్‌డౌన్ పొడిగించారు. అయితే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. అయితే జూన్‌లో మరోసారి లాక్‌డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి 10 వరకు లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం మరో పదిరోజుల పాటు లాక్‌డౌన్ పొడిగించారు. ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్ డౌన్ సడలించాలని, సాయంత్రం 5 గంటలనుంచి 6 గంటల వరకు అంటే గంటపాటు తిరిగి ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులు బాటు కల్పించాలని నిర్ణయించింది. అయితే తాజా కేబినెట్ సమావేశంలో పూర్తిగా ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x