ఎంతో కాలం నుంచి ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మాక్ కోసం ఎదురు చూశారు. అయితే ఎట్టకేలకు ఈ మ్యాచ్ ప్రారంభమైంది. కానీ.. మ్యాచ్ ప్రారంభమై 4 రోజులు గడుస్తున్నా.. కనీసం ఒక్కరోజు ఖ్అత కూడా సవ్యంగా సాగలేదు. కారణం వర్షం. తొలి రోజు నుంచే వరుణుడు ఈ మ్యాచ్ పై పగ పట్టినట్లు కుండపోత కురిపిస్తున్నాడు. వర్షం కారణంగా తొలి రోజు ఆట పూర్తిగా రద్దైన విషయం తెలిసిందే. రెండో రోజు కపోదా తొలి సెషన్ వర్షం కారణంగానే జరగలేదు. ఇక ఆ తర్వాత మూడో రోజు ఆట మొదలైన.. పెద్దగా సాగలేదు. నహారత్ 217 పరుగులు చేసి అలౌట్ కాగా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ కూడా 100 పరుగులు 2 వికెట్లు కోల్పోయింది. అయితే నాలుగోరోజూ మళ్లీ వరుణుడు విజృంభించాడు. మళ్లీ కుండపోత కురిపించాడు. దీంతో ఈ రోజు మొత్తం ఆట రద్దయింది.
కాగా.. మూడో రోజు ఆటతో తొలి ఇన్సింగ్స్ ప్రారంభించిన కివీస్ ఆట నిలిచిపోయే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 12, రాస్ టేలర్ క్రీజులో ఉన్నారు. అంతకుముందు బ్యాటింగ్ ప్రారంభించిన ఓపెనర్లు లాథమ్, డెవాన్ కాన్వేలు నిలకడగా ఆడారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా నిలకడగా ఆడుతూ భారత్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించిన తర్వాత తొలుత లాథమ్ (30) అవుటయ్యాడు. అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కాన్వే 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇషాంత్ బౌలింగులో పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ భారత్ కంటే 116 పరుగులు వెనకబడి ఉంది.
నేటి ఆట పూర్తిగా రద్దు కావడంతో రిజర్వు డేతో కలుపుకుని మిగిలింది రెండు రోజులే. ఈ రెండు రోజుల్లో మ్యాచ్ ఫలితం తేలడం దాదాపు అసాధ్యం. దీంతో డ్రాకే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక, మిగిలిన రెండు రోజుల ఆట కూడా జరగాలా? వద్దా? అనేది నిర్ణయించేది వరుణడే. ఒక వేళ మ్యాచ్ కనుక డ్రా అయితే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ విజేతలుగా భారత్-కవీస్ జట్లు ట్రోఫీని పంచుకుంటాయి.