ఏపీలో కరోనాకు మందు తయారుచేసి ఉచితంగా ఇస్తున్న కృష్ణ పట్నం ఆనందయ్యను చెన్నై హైకోర్టు అభినందించింది.
ఆనందయ్య చేస్తున్న పని ఎంతో గొప్ప కార్యమని
ఏపీలో కరోనాకు మందు తయారుచేసి ఉచితంగా ఇస్తున్న కృష్ణ పట్నం ఆనందయ్యను చెన్నై హైకోర్టు అభినందించింది.
ఆనందయ్య చేస్తున్న పని ఎంతో గొప్ప
, ఆయనను నిజంగా ప్రశంసిస్తున్నామని అన్నారు.
అనంతరం న్యాయమూర్తులు జస్టిస్ ఎన్ కరుబాకరణ్, టీవీ తమిళ్ సెల్వీలు ఆనందయ్యకు స్వయంగా సెల్యూట్ చేశారు.
ఇదే సమయంలో ఆయుర్వేద వైద్య విధానానికి ప్రభుత్వాల ప్రోత్సాహం కరువవ్వడంపై న్యాయమూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వాలు ఆయుర్వేద వైద్యాన్ని ప్రోత్సహించడంలో విఫలమయ్యాయన్న ఆనందయ్యపై అభినందనల వర్షం కురిపించారు.
డీఆర్డీవో తయారు చేసిన 2-డీజీ మందుపై విచారణ సందర్భంగా ఆనందయ్య మందు ప్రస్తావన వచ్చింది.
ఈ సందర్భంగానే ఆనందయ్యను ప్రశంసించిన జడ్జిలు.. కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.
ఆయుర్వేద వైద్యులను కేంద్రం ప్రోత్సహించాలని జస్టిస్ ఎన్ కరుబాకరణ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
ఈ సందర్భంగా భారతీయ ఎడిసన్గా పేర్గాంచిన జీడీ నాయుడును వారు గుర్తు చేశారు. అలాంటి అత్యుత్తమ ఆవిష్కర్తలు కూడా ఉంటారని అన్నారు.
అందరూ మోసగాళ్లే ఉండరని, ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ధర్మాసనం పేర్కొంది.