Thursday, November 21, 2024

‘నా మందు పనిచేస్తుంది.. మళ్లీ మొదలు పెడతా.. ఐసీఎంఆర్ అనుమతే మిగిలుంది’

కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు ఆనందయ్య. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అనేకమంది బాధితులకు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంకు చెందిన బొణిగి ఆనందయ్య తన ఆయుర్వేద వైద్యంతో మందులు అందిస్తున్నాడు. దీంతో వేల మంది ఆయన మందు వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఆనందయ్య మందుపై దేశ వ్యాప్తంగా దృష్టి పడింది. అయితే కేంద్ర వైద్య సంస్థలు ఐసీఎంఆర్‌, ఆయుష్ సంస్థలకు ఈ మందుపై కొన్ని ఫిర్యాదులు కూడా వెళ్లినట్లు సమాచారం. దీంతో ఈ మందు పపిణీని నిలిపివేస్తూ ఆనందయ్య ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే ఆయుష్ సంస్థ ఆనందయ్య మందుపై పరీక్షలు చేసింది. అలాగే ఐసీఎంఆర్ కూడా పరీక్షలు నిర్వహిస్తోంది.

ఆయుష్ సంస్థ ఇప్పటికే ఆనందయ్య మందుకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ మందు వల్ల ఎలాంటి దుష్ఫలితాలు లేవని తేల్చి చెప్పింది. దీంతో ఈ మందుపై ప్రజల్లో మరింత నమ్మకం పెరిగింది. ఇంకా ఐసీఎంఆర్ నుంచి ప్రకటన రావల్సి ఉంది. ఈ క్రమంలోనే ఆనందయ్య మీడియాతో మాట్లాడారు. స్థానిక సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డితో కలిసి ఆదివారం విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆనందయ్య.. తన మందు పంపిణీపై అనేక విషయాలను వెల్లడించారు. కరోనా నివారణకు వన మూలికలతో తాను తయారు చేసే మందును ప్రభుత్వ అనుమతులు వచ్చాకే పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రజల మద్దతు, ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళతానని స్పష్టం చేశారు.

తాను తయారు చేసిన మందుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టి పెట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. తాను తయారు చేసిన మందు వల్ల ఎలాంటి దుష్ఫలితాలు లేవని ఇప్పటికే ఆయుష్‌ బృందం నిర్ధారించిందని చెప్పారు. ఐసీఎంఆర్‌ వాళ్లు కూడా వచ్చి మందును పరిశీలిస్తారని అధికారులు చెప్పారన్నారు. ఆ తర్వాత అనుమతులు వచ్చాకే మందును ఎలా పంపిణీ చేయాలనే విషయమై ప్రభుత్వ సూచన, సహకారం మేరకు ఎమ్మెల్యే కాకాణి, ఇతర పెద్దలందరితో కలిసి ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు.

ఆనందయ్య మందుపై వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి కూడా మాట్లాడారు. ఆయుర్వేద మందుపై ఎటువంటి ఆరోపణలు తగవని, అనుమానాలు వద్దని అన్నారు. ఈ మందుపై ప్రజలకు నమ్మకం కలిగిందని, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో వ్యాధి ప్రబలుతుందనే ఆలోచనతో తాత్కాలికంగా పంపిణీని నిలిపి వేశారన్నారు. ఆనందయ్యను పోలీసులు అరెస్ట్‌ చేశారని, నిర్బంధించారని జరుగుతున్న ప్రచారం అబద్ధమని చెప్పారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేలోగా మందుకు సంబంధించిన మూలికల సేకరణలో ఆనందయ్య ఉన్నారని వెల్లడించారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x