న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ వెబ్‌సైట్.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని తీవ్రంగా అవమానించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా దారుణంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే కివీస్ వెబ్‌సైట్ TheAccNZ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. అందులో టీమిండియా సారధిని ఘోరంగా అవమానిస్తూ చేసిన మీమ్ ఇప్పుడు భారత క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి గురవుతోంది.
కివీస్ వెబ్‌సైట్ చేసిన పని కోహ్లీ అభిమానులకు ఏ మాత్రం మింగుడుపడడం లేదు. కోహ్లీని అవమానకర రీతిలో చూపించిన ఆ వెబ్‌సైట్‌పై భారత క్రికెట్ అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమి అనంతరం సదరు వెబ్‌సైట్ చేసిన ఈ పోస్టులో.. ఓ మహిళ డాగ్ బెల్ట్ వంటి బెల్ట్‌ను ఓ మరో వ్యక్తి మెడలో వేసి పట్టుకుని ఉంది.
ఆ మహిళను కివీస్ పేసర్ కైల్ జేమీసన్‌తో పోల్చిన కివీస్ వెబ్‌సైట్.. ఆ మనిషిని కోహ్లీతో పోల్చింది. ఇదే ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది.
భారత క్రికెట్ అభిమానులు, కోహ్లీ డైహార్డ్ ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియా వేదికగా ఆ వెబ్‌సైట్‌ను టార్గెట్ చేసి దుమ్మెత్తిపోస్తున్నారు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో కోహ్లీ రెండుసార్లూ జేమీసన్ బౌలింగ్‌లోనే ఔటవడంతో ఆ వెబ్‌సైట్ ఈ దారుణ చర్యకు దిగిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
కోహ్లీని అవమానించినందుకు గాను ఆ వెబ్‌సైట్‌తో పాటు న్యూజిలాండ్ మొత్తాన్ని చీల్చిచెండాతున్నారు.
కోహ్లీ లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్‌ని అవమానించడం తగదని కొందరు హెచ్చరిస్తుంటే, మరి కొందరేమో వ్యక్తిగత దూషణలకు దిగారు.
ఇలాంటి చర్యల వల్ల న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు ఉన్న మంచి ఇమేజ్ మసకబారుతుందని కామెంట్ చేస్తున్నారు.
ఇంకొంత మంది ఫ్యాన్స్.. జేమీసన్‌ను మహిళతో పోల్చుకుని తమను తామే దిగజార్చుకున్నారని కౌంటర్ వేస్తున్నారు.
ఏది ఏమైనా ఇలాంటి పోస్ట్‌తో కివీస్-భారత్ మధ్య ఉన్న స్నేహపూర్వక క్రికెట్ సంబంధాలు దెబ్బతింటాయని కూడా కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.