Wednesday, February 25, 2026

రూ.12.67 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కించుకున్న “కపుల్ ఫ్రెండ్లీ”

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ “కపుల్ ఫ్రెండ్లీ” బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లో 12.67 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది. ప్రస్తుతం సెకండ్ వీక్ లో “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణ సొంతం చేసుకుంటోంది. సెకండ్ వీక్ రన్ పూర్తయ్యే సరికి బాక్సాఫీస్ వద్ద మంచి నెంబర్ ను “కపుల్ ఫ్రెండ్లీ” క్రియేట్ చేయబోతోంది.

“కపుల్ ఫ్రెండ్లీ” చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేశారు.

నటీనటులు – సంతోష్ శోభన్, మానస వారణాసి, తదితరులు

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -