Friday, November 1, 2024

దర్శకుడు బాబీ చేతుల మీదుగా ‘లాభం’ ఫస్ట్ లుక్ విడుదల

విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా… తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన “లాభం” చిత్రం ఫస్ట్ లుక్ ను ప్రముఖ హిట్ చిత్రాల దర్శకుడు బాబీ చేతుల మీదుగా విడుదల చేశారు. ఆయనతో పాటు ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి వై.లు ఈ ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రం సెప్టెంబరు 9న వినాయక చవితి సందర్భంగా తమిళంతో పాటు తెలుగులోనూ ఏక కాలంలో థియేటర్లలో విడుదలవుతోంది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ చిత్రం ఫస్ట్ టైం రెండు భాషల్లోనూ విడుదల కావడం విశేషం. ఇందులో జగపతిబాబు విలన్ పాత్రలో నటిస్తుండగా, సాయి ధన్సిక ఓ కీలకమైన ప్రధాన పాత్ర పోషిస్తోంది.

S P జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్నిశ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ(వైజాగ్ సతీష్) ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఈ చిత్రానికి లాయర్ శ్రీరామ్ సమర్పణ. హరీష్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. మాస్టర్, ఉప్పెన తరువాత విజయ్ సేతుపతి నటించిన చిత్రం తెలుగులో విడుదల అవుతున్న ఈ చిత్రం ఇదే. ఇందులో విజయ్ సేతుపతి రైతు సమస్యలపై పోరాడే యువకునిగా నటిస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు బాబీ మాట్లాడుతూ ‘విజయ్ సేతుపతి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆయన నటించిన చిత్రాలు ఇప్పుడు తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాధించుకుంటున్నాయి. ఇటీవల తెలుగులో నేరుగా నటించిన సైరా, ఉప్పెన చిత్రాలలో ఆయన పాత్రలకు మంచి అప్లాజ్ వచ్చింది. లాభం చిత్రంతోనూ ఆయన తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తారనే నమ్మకం వుంది. ఇందులో అతని పాత్ర తన గత చిత్రాల్లానే చాలా వైవిధ్యంగా వుంటుందని అనుకుంటున్నా. ఫస్ట్ లుక్ చూస్తుంటే… విజయ్ సేతుపతి లుక్ చాలా యూనిక్ గా కనిపిస్తోంది. ఇందులో రైతుల సమస్యలపై పోరాడే యువకుని పాత్రలో విజయ్ సేతుపతి ప్రేక్షకుల్ని అలరిస్తారని నమ్మకం ఉంది. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాతలకు అభినందనలు. ఈ చిత్రం విజయం సాధించి మంచి లాభాలు తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నా. ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా విడుదలవుతోంది కాబట్టి దేవుడి ఆశీస్సులు కూడా ఈ చిత్రానికి, నిర్మతలకు పుష్కలంగా వుండాలని కోరుకుంటున్నా’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత బత్తుల సత్యనారాయణ(వైజాగ్ సతీష్), సమర్పకుడు లాయర్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

తారాగణం:-
విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్, జగపతిబాబు, సాయి ధన్సిక, కలైయ రసన్, రమేష్ తిలక్, పృత్వి రాజన్, డేనియల్ అన్నే పోపే, నితీష్ వీర, జయ్ వర్మన్ తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు:-
రచన, దర్శకత్వం: S.P. జననాథన్
స్క్రీన్ ప్లే: N. కల్యాణ కృష్ణన్
మ్యూజిక్: D. ఇమ్మాన్
DOP: రాంజీ
ఎడిటర్: N. గణేష్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్: వి.సెల్వకుమార్
స్టంట్: ధన అశోక్
PRO: శ్రీ మారి

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x