అక్కడ పెళ్లి జరుగుతోంది. వధూవరులిద్దరూ వివాహానికి సిద్ధమయ్యారు. వధూవరుల తరపు బంధువులంతా వివాహ వేడుకకు హాజరయ్యారు. వాళ్ళ పిల్లలు, మనుమలు అంతా కూడా వివాహానికొచ్చారు. ఆశ్చర్యపోయారా..? కానీ ఇది నిజం. అంతే కాదు ఈ వివాహం ఎక్కడో విదేశాల్లో జరిగింది కాదు. మన దేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
పెళ్లి కాకుండానే పిల్లల్ని కని, వాళ్లకు పెళ్లిళ్లు అయి, వాళ్లకు కూడా పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఆ 65 ఏళ్ల అబ్బాయి, 60 ఏళ్ల అమ్మాయి.. 40 ఏళ్లుగా డేటింగ్ చేశారు.
అయితే పెళ్లి చేసుకోకుండానే చనిపోతే మరణం తర్వాత స్వర్గం ప్రాప్తించదని భయం పట్టుకోవడంతో, పిల్లల సమక్షంలో వివాహం చేసుకున్నారు. దీంతో 40 ఏళ్ల డేటింగ్ తర్వాత వాళ్లిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారి పిల్లలు, మనవలు, మనమవరాళ్లు ఈ పెళ్లి వేడుకను అత్యంత వైభవంగా జరిపించారు.