Tuesday, March 24, 2026

టికెట్ లేకున్నా ట్రైన్ ప్రయాణం.. ఇలా చేస్తే చాలు

మీరు టికెట్ కొనకుండా ఎప్పుడైనా రైల్లో ప్రయాణం చేశారా..? అలా ప్రయాణం చేసేటప్పుడు టీసీ పట్టుకుంటే రూ.500 నుంచి రూ.1000 వరకు ఫైన్ ఉంటుంది. అయితే ఇకపై మీరు భయపడాల్సిన పని లేదు. టికెట్ లేకపోయినా ట్రైన్ ఎక్కేయొచ్చు. అవునండి ఇది నిజం. ఈ మేరకు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది రైల్వే శాఖ. ముందుగా రిజర్వేషన్ చేయించుకోకపోయినా, టికెట్ తీసుకోకపోయినా కూడా నిరభ్యంతరంగా రైలు ఎక్కవచ్చట.

అయితే దీని కోసం కచ్చితంగా ప్లాట్‌ఫామ్ టికెట్ మాత్రం మీ వద్ద ఉండాలి. ట్రైన్‌లోకి ఎక్కిన తర్వాత దానిని టీటీఈకి చూపించి టికెట్ తీసుకునే వీలు కల్పిస్తోంది రైల్వే. చివరి నిమిషంలో హడావిడిగా రైల్వే స్టేషన్‌కు వచ్చి టికెట్ తీలుకోకుండా ట్రైన్ ఎక్కలేక, టికెట్ తీసుకోలేక పూర్తిగా ప్రయాణము మిస్ చేసుకునే వారికి ఈ విధానం గొప్పగా ఉపయోగపడనుంది.

రిజర్వేషన్ లేకుండా స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు అక్కడి టికెట్ కౌంటర్ల ముందు బారులు తీరిన లైన్లలో నిల్చోవాల్సిన అవసరం లేదు. యూటీసీ యాప్ ద్వారా లేదా స్టేషన్లలోని వెండింగ్ మెషిన్ల ద్వారా ప్లాట్‌ఫామ్ టికెట్ తీసుకుంటే చాలు. దానితో రైలు ఎక్కేయవచ్చు. ట్రైన్ ఎక్కిన తర్వాత దానిని టీటీఈకి చూపించి టికెట్ తీసుకోవచ్చు. అంతేకాదు సీట్లు అందుబాటులో ఉంటే రిజర్వేషన్ చేయించుకుని బెర్త్ కూడా పొందవచ్చు. రైల్వే శాఖ సరికొత్తగా తెచ్చిన ఈ విశానం ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -