యూరోపియన్ క్రికెట్ సిరీస్‌లో ఓ బ్యాట్స్‌మెన్ అరుదైన ఘనత సాధించాడు. 28 బంతుల్లోనే సెంచరీ బాదేరి రికార్డు ఇన్నింగ్స్ ఆడాడు. యూరోపియన్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అయిన 32 ఏళ్ల అహ్మద్ ముస్సాదిక్ ఈ అసాధ్యమైన రికార్డును నెలకొల్పాడు. అహ్మద్ ఇన్నింగ్స్‌లో 13 సిక్సర్లు, ఏడు ఫోర్ల సహాయంతో ఈ రికార్డులు అహ్మద్ అందుకున్నాడు. దీంతో ఇప్పటివరకు భారత సంతతికి చెందిన గౌహర్ మనన్ పేరున ఉన్న 29 బంతుల్లో సెంచరీ రికార్డును ఒక్క బంతి తేడాతో అహ్మద్ అధిగమించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఆ ప్లేయర్.. చివరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు.
యూరోపియన్ క్రికెట్‌లో భాగంగా టీహెచ్‌సీసీ హాంబర్గ్ జట్టుకు కమ్మర్‌ఫెల్డర్ స్పోర్ట్‌వెరిన్ జట్టుకు మధ్య మంగళవారం ఓ టీ10 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కమ్మర్‌ఫెల్డర్ స్పోర్ట్‌వెరిన్ ఓపెనర్ అహ్మద్ ముస్సాదిక్ రికార్డు సెంచరీ సాధించి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. అహ్మద్ భారీ ఇన్నింగ్స్‌తో కమ్మర్ ఫెల్డర్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ముస్సాదిక్ తొలి బంతి నంచే బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. స్పిన్నర్లు, పేసర్లు అన్న తేడా లేకుండా బంతి బాదడమే లక్ష్యంగా పెట్టుకుని, ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. టీహెచ్‌సీసీ హాంబర్గ్ జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
కాగా.. 199 పరుగలు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీహెచ్‌సీసీ జట్టు.. 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 53 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ముస్సాదిక్ ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు 145 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.