Friday, November 1, 2024

బాబర్‌ను చూసి కోహ్లీ నేర్చుకోవాలన్న పాక్ మాజీ.. తిట్టిపోస్తున్న ఇండియన్ ఫ్యాన్స్

పాకిస్తాన్ యువ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు ఎప్పుడూ ఆకాశానికెత్తేస్తూ ఉంటారు. ఇక కొందరైతే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తమ బాబర్ ముందు దిగదుడుపేనంటూ తెగ కోతలు కోస్తుంటారు. తాజాగా పాక్ మా తాజాగా పాక్ మాజీ క్రికెటర్, పేసర్ అకిబ్ జావెద్ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. బాబర్ ఆజంను ఆకాశానికెత్తేస్తూ.. విరాట్ కోహ్లీని విపరీతంగా విమర్శించాడు. ‘టెక్నిక్ విషయంలో విరాట్ కోహ్లీ కంటే బాబర్ ఆజం చాలా బెటర్ బ్యాట్స్‌మెన్. విరాట్ కోహ్లీ చాలా షాట్స్ ఈజీగా కొడతాడు. కానీ స్వింగ్ బాల్స్‌కు అతను చాలా సార్లు అవుట్ అయ్యాడు. ఆఫ్ స్టంప్ అవతల సడూ బాల్స్ ఆడడంలో తడబడతాడు. అతడు చాలా సార్లు అవే బంతులకు అవుటవుతూ ఉంటారు. ఈ విషయంలో బాబర్ ఆజం చాలా టెక్నిక్‌తో ఆడతాడం’టూ తమ ఆటగాడిని ప్రశంసల్లో ముంచెత్తాడు. అంతేకాదు తన దృష్టిలో పాక్‌కి బాబర్ అజాం.. భారత సచిన్ టెండూల్కర్‌ లాంటి వాడంటూ ఆకాశానికెత్తేశాడు.

బాబర్‌ను ప్రశంసించుకుంటే ఓకే.. కానీ, కోహ్లీని మధ్యలోకి లాగి విమర్శించడంతో భారత క్రికెట్ అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. జావెద్ కామెంట్లపై ఒక్కసారిగా మూకుమ్మడిగా ట్రోల్స్ చేయడం మొదలుపెట్టేశారు. అభిమానులు స్ట్రాంగ్ కౌంటర్లిస్తూ తిప్పి కొడుతున్నారు. చిన్న, చిన్న పిల్లకూన జట్లయిన జింబాబ్వే, నెదర్లాండ్ వంటి జట్లపై ఆడే గొప్ప బ్యాట్స్‌మన్ బాబర్ అని అందరికీ తెలుసని, అలా ఆడే నెంబర్ వన్ ర్యాంకు పట్టేశాడని విమర్శలు గుప్పించారు. కానీ విరాట్ కోహ్లీ.. ప్రపంచ మేటి జట్లయిన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి టాప్ జట్లలోని నెంబర్ వన్ బౌలర్లను సైతం వణికిస్తాడని, వీరిద్దరికీ పోలిక పెట్టడంతోనే జావెత్ తెలివేంతో అర్థమైపోతోందని హేళన చేస్తున్నారు.

కాగా.. కోహ్లీ కంటే బాబర్ గొప్పంటూ ప్రశంసించిన జావెద్.. ఓ విషయంలో మాత్రం కోహ్లీని చూసి బాబార్ నేర్చుకోవలసింది కూడా ఒకటి ఉందని అన్నాడు. అదే ఫిట్ నెస్. ఫిట్‌నెస్ విషయంలో బాబర్ ఆజమ్, విరాట్ కోహ్లీని ఫాలో అవ్వాలని అన్నాడు. అప్పుడే అతడు మరింత మెరుగైన ప్లేయర్ అవుతాడని అభిప్రాయపడ్డాడు. కానీ టెక్నిక్ విషయంలో మాత్రం విరాట్ కోహ్లీ.. బాబర్‌ కంటే ఎంతో కింద ఉన్నాడని అన్నాడు. కోహ్లీ తన టెక్నిక్ మెరుగుపర్చుకోవాలంటే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ పడే బంతులను ఎలా ఆడాలో బాబర్‌ను చూసి నేర్చుకోవాలని ఉచిత సలహా ఇచ్చాడు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x