Sunday, March 22, 2026

వన్డేల్లో బాబర్ ఫస్ట్ ర్యాంక్.. శుభాకాంక్షలు చెబుతూనే చురకలంటించిన జాఫర్

ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ వన్డే కెప్టెన్ బాబర్ అజాం టాప్ ర్యాంకుకు చేరాడు. బాబర్(865 రేటింగ్ పాయిట్లు)తో టాప్ ర్యాంకుకు చేరడంతో.. ఇప్పటివరకు టాప్‌లో ఉన్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(857 రేటింగ్‌ పాయింట్లు) రెండో స్థానానికి పడిపోయాడు. ఈ క్రమంలోనే బాబర్‌కు భారత మాజీ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ వసీం జాఫర్‌ శుభాకాంక్షలు తెలిపాడు. ట్విటర్‌ ద్వారా అతడిని విష్ చేశాడు. అయితే విష్ చేస్తూనే అతడి టాప్‌ ర్యాంక్‌ ఎక్కువకాలం నిలవదనేలా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. విరాట్‌కు ఛేజింగ్‌ అంటే చాలా ఇష్టమని, టాప్‌ ర్యాంక్‌ను కూడా త్వరలోనే తిరిగి ఛేజ్ చేసి సంపాదించుకుంటాడని తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ‘టీమిండియా కెప్టెన్‌కు ఛేజింగ్ అంటే ఎంత ఇష్టమో తెలుసుగా..? నీ టాప్ ర్యాంక్ కూడా అతి త్వరలో ఛేజ్ చేస్తాడు’ అని తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. జాఫర్‌ చేసిన ఈ ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్‌లో కోహ్లీ ఏకంగా 1258 రోజులు పాటు టాప్‌ ర్యాంక్‌లో కొనసాగి చరిత్ర సృష్టించాడు. ఇటీవల కాలంలో అతనికి వన్డే క్రికెట్‌ ఆడే అవకాశం ఎక్కువగా రాకపోవడం వల్లే టాప్‌ ర్యాంక్‌ను కోల్పోయాడు. చివరిసారిగా అతను ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఆడాడు. అందులో కూడా రెండు అర్ద శతకాలతో రాణించాడు. ఈ సిరీస్‌లో టీమిండయా 2-1తో ఇంగ్లండ్‌ను ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. దీంతో పాటు టెస్ట్, టీ20 సిరీస్‌లలో కూడా ఇంగ్లండ్‌ను ఓడించి వరుస సిరీస్‌లను దక్కించుకుంది.

మరోవైపు దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో బాబర్ అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 103, రెండో వన్డేలో 31, మూడో వన్డేలో 94 పరుగులతో రాణించి సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో పాక్ జట్టు సఫారీలను 2-1 తో ఓడించింది. కాగా.. ఆ సిరీస్‌ ద్వారా బాబర్ 13 పాయింట్లు దక్కించుకున్నాడు. కోహ్లీపై 8 పాయింట్ల ఆధిక్యం సాధించాడు. దీంతో టాప్‌ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో జహీర్‌ అబ్బాస్‌, జావిద్‌ మియాందాద్‌, మహ్మద్‌ యూసఫ్‌ల తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌ ర్యాంక్‌కు చేరుకున్న నాలుగో పాక్‌ బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కాడు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -