Sunday, March 22, 2026

నదాల్‌కు మళ్లీ పెళ్లి..? ఫేస్ బుక్‌లో అప్‌డేట్ వైరల్

స్పెయిన్ బుల్ టెన్నిస్‌ స్టార్ ర‌ఫేల్ న‌దాల్‌ మళ్లీ పెళ్లి చేసుకున్నాడనే వార్త ఫేస్ బుక్‌లో భారీ సంచలనమైంది. నదాల్ ఫేస్‌బుక్ చూసిన వారంతా ఈ విషయం తెలిసి విపరీతంగా షాక్ అయ్యారు. నదాల్ తన ఎఫ్‌బీ ఖాతా రిలేషన్ స్టేటస్‌ను ‘గాట్ మ్యారీడ్’ అని సోమవారం అప్‌డేట్ చేశాడు. ఇది నెట్టింట భారీ చర్చకే దారి తీసింది. రెండేళ్ల క్రితమే ఇష్ట సఖి మరియా ఫ్రాన్సిస్కా పెరెల్లోను వివాహమాడిన నదాల్ మళ్లీ పెళ్లి చేసుకోవడం ఏంటని అభిమానులు అయోమయంలోకి పడ్డారు. అయితే అసలు విషయం తెలిసి ఊపిరి పీల్చుకుంటున్నారు.

2019 అక్టోబర్‌లో నదాల్.. తన మరియా ఫ్రాన్సిస్కా పెరెల్లోను వివాహమాడాడు. అయితే ఈ అప్‌డేట్‌ చూసిన కొందరు అభిమానులు నదాల్‌ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడనుకుని పొరబడి, అతనికి శభాకాంక్షలు కూడా తెలిపారు. కానీ, అసలు విషయం ఏంటంటే.. నదాల్‌ పొరపాటున ఫేస్‌బుక్‌లో రిలేషన్షిప్‌ స్టేటస్‌ను అప్‌డేట్ చేశాడు. అది కాస్తా అత‌ను ఆదివార‌మే పెళ్లి చేసుకున్నట్లుగా చూపించింది. దీంతో గందరగోళం మొదలైంది. ఈ అప్‌డేట్ చూడగానే.. నదాల్ ఫ్యాన్స్ కొందరు సంతోషంగా శుభాకాంక్షలు కూడా చెప్పడం విశేషం. అయితే దీనిపై నదాల్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు.

ఇదిలా ఉంటే రఫా ప్రస్తుతం ఫ్రెంచ్ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో ఆడుతున్నాడు. టోర్నీలో వరుస విజయాలతో నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లాడు. ఈ రౌండ్‌లో అతను ఇటలీకి చెందిన 19 ఏళ్ల జన్నిక్‌ సిన్నర్‌ను ఎదుర్కోనున్నాడు. రఫా ప్రస్తుతానికి 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌లు సాధించి స్విస్‌ యోధుడు రోజర్‌ ఫెదరర్‌తో(20) సమానంగా ఉన్నాడు. కాగా.. మడ్ కోర్టులో నదాల్‌కు తిరుకులేదనే విషయం అందరికీ తెలిసిందే. 2005లో కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు కేవలం 2 సార్లు మాత్రమే నదాల్ ఓడిపోయి 103 విజయాలు సాధించాడు. మరి ఈ సారి కూడా అదే తీరులో గెలుపు సాధిస్తాడేమో చూడాలి.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -