కొన్నిసార్లు క్రికెట్‌లో ఎవరూ ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. విచిత్రమైన క్యాచ్‌లు, నమ్మశక్యం కాని షాట్‌లు, అరుదైన రనౌట్‌లు అప్పుడప్పుడూ ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. తాజాగా న్యూజిల్యాండ్-బంగ్లాదేశ్ మధ్య కూడా అలాంటి సంఘటనే జరిగింది. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ తమిమ్ ఇక్బాల్‌ను కివీస్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ రనౌట్ చేసిన విధానం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీనిని నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ‘వామ్మో! అదేం ఫుట్ బాల్ కాదు నీషమ్.. అలా రనౌట్ చేశావేంటి..?’ అని ముక్కున వేలేసుకుంటున్నారు.
30 ఓవర్లకు 2 వికట్లు మాత్రమే కోల్పోయి 133 పరుగుల చేసిన బంగ్లాదేశ్ పటిష్ఠ స్థితిలో నిలిచింది. అయితే ఒక్క అనవసర రన్ వారి బ్యాటింగ్‌ను అల్లకల్లోలం చేసింది. 78 పరుగులతో ధాటిగా ఆడుతున్న బంగ్లా కెప్టెన్ తమిమ్ ఇక్బాల్ వికెట్ కోల్పోయేలా చేసింది. 31వ ఓవర్లో నీషమ్ వేసిన రెండో బంతిని బంగ్లా బ్యాట్స్‌మన్ ముష్ఫికర్ రహీమ్ డిఫెండ్ చేశాడు. అయితే బంతికి దగ్గర్లో ఫీల్డర్లు ఎవరూ లేకపోవడంతో సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న తమిమ్ కూడా రన్ తీసేందుకు ముందుకొచ్చాడు. అయితే ఉన్నట్లుండి నీషమ్ బంతిని ఫుట్ బాల్‌లా కాలితో తన్నాడు. ఆ బంతి నేరుగా వికెట్లను తాకి బేల్స్ పడేసింది. కనీసం వెనక్కి తిరిగే టైం కూడా తమిమ్‌కు మిగల్లేదు. దీంతో బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది.
It’s the golden a̶r̶m̶ boot!@JimmyNeesh with some tidy footwork to run out Tamim Iqbal for a well made 78.
Tune in live, only on Spark Sport #NZvBAN ⭕️🏏 pic.twitter.com/pVx480PPpz
— Spark Sport (@sparknzsport) March 23, 2021
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిల్యాండ్ నిర్ణత 50 ఓవర్లలో 6 వికెట్లకు 271 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ తరపున తమిమ్ ఇక్బాల్(78), మొహమ్మద్ మిథున్(73) అర్థసెంచరీలు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిల్యాండ్ నెమ్మదిగా ఆడింది. ఓపెనర్లు మార్టిన్ గప్తిల్(20), హెన్రీ నికోల్స్(13) విల్ యంగ్(1) తక్కువ పరుగులకే అవుటైనా.. వన్ డౌన్‌లో వచ్చిన డెవోన్ కాన్వే(72) అర్థసెంచరీ సాయంతో కివీస్ కెప్టెన్, వికెట్ కీపర్ టామ్ లాథమ్(110 నాటౌట్) మ్యాచ్‌ను గెలిపించాడు.