Sunday, March 22, 2026

ఐపీఎల్‌లో తన ఫేవరేట్ టీం ఏదో చెప్పిన రశ్మిక.. ఫ్యాన్స్ ఖుషి

సినిమా, క్రికెట్.. ఈ రెండింటికీ భారత దేశంలో ఎంతో గొప్ప స్థాయి ఉంది. ఈ రెండు రంగాల్లో ఉన్న వారికి కోట్లలో అభిమానులుంటారు. అయితే తమ క్రికెటర్‌కు ఏ సినిమా స్టార్ అంటే ఇష్టం, తమ స్టార్ నటుడికి ఏ క్రికెటర్ అంటే ఇష్టం అనేది చాలా మంది అభిమానుల్లో ఉండే ప్రశ్న. ఇలాంటి విషయాల్లో కొన్ని సార్లు సదరు స్టార్ సెలబ్రిటీ తమ అభిప్రాయాలను బయటపెడితే అదో సెన్సెషన్‌గా మారుతుంది. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్న ఇలాంటి సెన్సెషన్‌కే తెరతీసింది. ఐపీఎల్‌లో తనకు నచ్చిన జట్టేదో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.

కరోనా విజృంభిస్తుండడంతో ప్రస్తుతం నటీనటులంతా ఇళ్లకే పరిమితమైపోయారు. షూటింగ్‌లన్నీ వాయిదాపడడంతో ఖాళీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మిగతా అభిమానుల్లాగే వారు కూడా ఐపీఎల్‌ చూస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. రశ్మిక కూడా అదే చేస్తోంది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రాంలో అభిమానులతో పంచుకుంది. తన చిన్ననాటి విషయాలను, ఇష్టమైన వాటి గురించి షేర్‌ చేసుకుంది. ఈ సందర్భంగా ఒక అభిమాని ఆమెను ‘ఐపీఎల్‌లో మీ ఫెవరెట్‌ టీమ్‌ ఏది..?’ అని అడిగాడు. దానికి రష్మిక.. ‘ఈ సాలా కప్‌ నమ్‌దే’ అంటూ ఇన్‌డైరెక్ట్‌గా ఆర్‌సీబీ తన ఫెవరెట్‌ అని చెప్పేసింది.

రశ్మిక ఇలా చెప్పడంతో కోహ్లీ ఫ్యాన్స్, ఆర్సీబీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. రశ్మిక సొంత రాష్టం కర్నాటక. దాంతో మాతృ రాష్రం మీద ఆమెకు ఉన్న ఇష్టంతోనే బెంగళూరుకు సపోర్ట్ చేస్తోందంటూ మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ‘ఈ సాలా కప్‌ నమ్‌దే’ అనే స్లోగన్‌‌తో ఆర్సీబీ గతేడాది యూఏఈ వేదికగా జరిగిన సీజన్‌లో బరిలోకి దిగింది. కానీ కప్ కొట్టలేకపోయింది. ప్లేఆఫ్ వరకు వెళ్లి ఇంటి దారి పట్టింది. కానీ ఈ సారి మాత్రం కసిగా ఆడుతూ టోర్నీలో వరుస విజయాలు సాధిస్తూ ముందుకెళుతోంది. దీంతో ఈ సారి కచ్చితంగా ‘ఈ సాలా కప్ నందే’ అని ఆర్సీబీ అభిమానులంతా భావిస్తున్నారు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -