Sunday, March 22, 2026

ముంబైపై చరిత్ర సృష్టించిన ఆర్సీబీ బౌలర్

చెన్నై: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలర్ హర్షల్ పటేల్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ బౌలర్ సాధించని ఘనత సాధించి రికార్డులకెక్కాడు. 14 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ జట్టుపై ఏ ఆటగాడు కూడా 5 వికెట్లు తీయలేదు. అయితే ఐపీఎల్ 2021 తొలి మ్యాచ్‌లోనే హర్షల్ పటేల్ తొలిసారి ఈ ఘనత సాధించాడు. తొలి ఓవర్లో 14 రన్స్ ఇచ్చిన హర్షల్.. ఆ తరువాతి 3 ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబై బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేశాడు. మిడిలార్డర్‌లో ఇషాన్ కిషన్(8), హార్దిక్ పాండ్యా(13) వంటి కీలక బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేయడంతో పాటు చివరి ఓవర్లో ఏకంగా 3 వికెట్లు తీసి అదరగొట్టాడు. దీంతో మొదటిసారిగా 5 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు.

కాగా.. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై బెంగళూర విజయం సాధించింది. ఇరు జట్ల బౌలుర్లు కట్టుదిట్టండి బౌలింగ్ చేయడంతో బ్యాట్స్‌మన్ పరుగులు చేయడానికి చెమటోడ్చారు. తొలుత ముంబై బ్యాట్స్‌మన్‌ను బెంగళూరు బౌలర్లు పరుగులు చేయకుండా అడ్డుకోవడమే కాక, క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు. ఆ తరువాత బెంగళూరు బ్యాట్స్‌మన్‌ను ముంబై బౌలర్లు కూడా చివరి వరకు నిలువరించారు. అయినప్పటికీ.. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు చివరి బంతి వరకు పోరాడి ఎలాగైతేనేం విజయం సాధించింది. బెంగళూరు బ్యాట్స్‌మెన్‌లలో ఏబీ డివిలియర్స్(48: 27 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సులు), గ్లెన్ మ్యాక్స్‌వెల్(39: 28 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సులు), విరాట్ కోహ్లీ(33: 29 బంతుల్లో, 4 ఫోర్లు) ధాటిగా ఆడారు. ఇక మిగతా బ్యాట్స్‌మెన్‌లలో వాషింగ్టన్ సుందర్(10) మినహా మరెవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేదు. ముంబై బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా, మార్కో జాన్సేన్ చెరో రెండు వికెట్లు తీయగా, ట్రెంట్ బౌలర్, కృనాల్ పాండ్యాలకు చెరో వికెట్ తీశారు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -