Sunday, March 22, 2026

వామిక విషయంలో విరుష్క తీరుపై ఫ్యాన్స్ యాంగ్రీ.. ఓవర్ యాక్షన్ అంటూ..

సెలబ్రిటీలకు సంబంధించి ఏ చిన్న విషయం అయినా.. అభిమానులకు ఎంత ఆసక్తి ఉంటుందో వేరే చెప్పలేదు. వారు చేసే ప్రతీ పనిని ఎంతో దగ్గర నుంచి పరిశీలిస్తుంటారు. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అతడి భార్య, బాలీవుడ్ నటి అనుష్క విషయంలో కూడా ఫ్యాన్స్ ఇలానే ప్రవర్తిస్తున్నాడు. మూడేళ్ల క్రితం వీరిద్దరి పెళ్లైన తరువాత, ఏడాది క్రితం వీరికి ఓ పాప కూడా జన్మించింది. ఆ పాపకు వామిక అని పేరు పెట్టినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కానీ ఇప్పటివరకు ఆ పాప ముఖం చూపించలేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ పాప మీడియా కంట పడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక తాజాగా ఇంగ్లండ్ టూర్ కోసం బుధవారం టీమిండియా బయలుదేరింది. ఆ సమయంలో ఎయిర్ పోర్టు వద్ద వామిక ముఖాన్ని పూర్తిగా దాచేసింది. దీనిపై కొందరు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ‘విరుష్క దంపతులు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారం’టూ మండిపడుతున్నారు. అయితే కొంతమంది ఫొటోజర్నలిస్టుల తీరుపైనా సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇంగ్లాండ్ టూర్‌ కోసం టీమిండియా ప్లేయర్, స్టాఫ్​, క్రికెటర్ల ఫ్యామిలీ మెంబర్స్​ అంతా ముంబైలో 14 రోజుల క్వారంటైన్​లో ఉన్నారు. బుధవారం రాత్రి ఇంగ్లండ్​ బయలుదేరారు. విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ త‌మ కూతురు వామిక‌తో క‌లిసి ఎయిర్‌పోర్ట్ ద‌గ్గ‌ర ఉన్న ఫొటోలు వైర‌ల్‌గా మారాయి. ఈ క్రమంలో ఫొటో జర్నలిస్టుల కంట తన బిడ్డ ముఖం పడకుండా వామికా ముఖాన్ని గట్టిగా అదిమిపట్టుకుని లోపలకి వెళ్లింది అనుష్క. దీంతో.. విరుష్క జోడీపై కొందరు నెటిజన్స్ మండిపడుతున్నారు. ‘కనీసం బిడ్డకు ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛనైనా ఇవ్వూ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొంతమంది ఆమె తీరుపై ఓవర్ యాక్షన్ అంటూ మండిపడుతున్నారు.

తమ కూతురి విషయంలో విరుష్కలు ముందే ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ‘ఆస్క్ మీ’ సెషన్​లో విరాట్​.. ‘సోషల్ మీడియా అంటే ఏమిటో అర్థం చేసుకునే వరకు, ఆమె సొంతంగా ఆలోచించే వరకు మా బిడ్డను సోషల్ మీడియాకు బహిర్గతం చేయకూడదని, దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నాం’ అని తేల్చి చెప్పాడు. ఈ క్రమంలోనే వారు తమ పాప ముఖం కనపడకుండా చూసుకుంటున్నారు. దీంతో వారి ప్రైవసీని దెబ్బతీయొద్దంటూ ఫోటో జర్నలిస్లులపై కొందరు అభిమానులు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -