Wednesday, February 25, 2026

చార్మింగ్ స్టార్ శర్వా ‘భోగి’ ఫస్ట్ లుక్ రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా తొలిసారిగా యాక్షన్ మావెరిక్ సంపత్ నందితో కలిసి భారీ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా భోగి సినిమా చేస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కెకె రాధామోహన్ ఎపిక్ స్కేల్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం శర్వా కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన వెంచర్‌లలో ఒకటిగా రూపొందుతోంది. ఈరోజు మేకర్స్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఫస్ట్ లుక్‌లో శర్వా ఇప్పటివరకు కనిపించని రగ్గడ్, ఫెరోషస్ మాస్ అవతార్‌లో కనిపిస్తున్నారు. రగ్గడ్ గడ్డం, మీసం, కర్లింగ్ జుట్టుతో రా & రఫ్ లుక్‌లో కనిపించడం అదిరిపోయింది. భారీ మాచెట్‌లాంటి ఆయుధం వెనుక కూర్చుని ఉన్న శర్వా లుక్, సినిమాలోని హింసాత్మక ప్రపంచాన్ని సూచిస్తుంది. ఎంబర్స్, స్పార్క్స్‌తో నిండిన డార్క్ బ్యాక్‌డ్రాప్ సినిమాకి “A Blood Fest” ట్యాగ్‌లైన్ పర్ఫెక్ట్ యాప్ట్.

ఈ సినిమాకోసం శర్వా పూర్తిగా ట్రాన్స్‌ఫార్మేషన్ అయ్యారు. ఇది ఆయనలోని కొత్త కోణాన్ని చూపించే కంప్లీట్ రీ ఇన్వెన్షన్. ప్రతి ఫ్రేమ్‌లోనూ శర్వా ‘బీస్ట్ మోడ్’లోకి అడుగుపెడుతున్నారని స్పష్టమవుతోంది. డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రాన్ని 1960ల కాలంలో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ సెట్‌పై ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్‌లు చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్‌లను డిజైన్ చేశారు.

ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నె, సినిమాటోగ్రఫీ కిషోర్ కుమార్ అరోకియా నిర్వహిస్తుండగా, బ్లాక్‌బస్టర్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 28న రక్షా బంధన్ సందర్భంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఒకేసారి గ్రాండ్ పాన్-ఇండియా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

తారాగణం: చార్మింగ్ స్టార్ శర్వా, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -