ఐపీఎల్ 14వ సీజన్లో కొత్తగా గురువారం జరగబోతున్న రాజస్థాన్-ఢిల్లీ మ్యాచ్‌పై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్, ఢిల్లీ కెప్టెన్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్.. ఇద్దరూ టీమిండియా యువ ఆటగాళ్లు కావడం, ఈ సీజన్‌తోనే తొలిసారి వీరిద్దరూ కెప్టెన్లుగా ఎంపిక కావడంతో వీరిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ అంచనాలను తగ్గట్లుగానే వీరిద్దరూ తొలి మ్యాచ్‌లలో అద్భుతంగా రాణించారు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ సెంచరీతో అదరగొట్టగా.. చెన్నైతో మ్యాచ్‌లో పంత్ చక్కటి కెప్టెన్సీ స్కిల్స్ చూపించాడు.
అయ్యర్ గైర్హాజరీలో తొలి సారి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన రిషబ్ పంత్‌పై ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ పంత్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. తనకు రిషబ్ పంత్‌లో కోహ్లీ, విలియమ్సన్‌లు కనిపిస్తున్నారని, అతడి దూకుడులో కోహ్లీ కనిపిస్తుంటే, కెప్టెన్సీలో విలియమ్సన్‌ను గుర్తుకు తెస్తున్నాడని ప్రశంసల్లో ముంచెత్తాడు. ఈ ఐపీఎల్లో పంత్ ఏ స్థానంలో బ్యాటింగ్ రావాలనే దానిపై తమకు క్లారిటీ లేదని, కానీ అతనికి నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్ బాగా కలిసొచ్చిందని, ఆ స్థానాల్లోనే అతడు బ్యాటింగ్‌కు దిగేలా చూస్తామని చెప్పాడు. అయితే కీపింగ్‌లో మాత్రం పంత్ కొంత మెరుగవ్వాలని, కొన్నిసార్లు అనవసర తప్పులు చేస్తున్నాడని, వాటిని సరిదిద్దుకుంటే అతడు మేటి కీపర్‌గా కూడా పేరు తెచ్చుకోగలడని అన్నాడు.
ఇదిలా ఉంటే సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 189 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఆ జట్టు ఓపెనర్లు పృధ్వీ షా(72), శిఖర్ ధవన్(85) విజృంభించి ఆడడంతో ఢిల్లీ జట్టు భారీ లక్ష్యన్ని సులభంగా ఛేదించింది. వీరిద్దరి మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడడంతో కేవలం 18.4 ఓవర్లలోనే ఢిల్లీ 3 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసి సునాయాసంగా విజయం సాధించింది. తొలి మ్యాచ్ విజయం సాధించి ఉత్సాహంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ రేపు రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుండడంతో ఈ పోటీపై భారీ అంచనాలే ఉన్నాయి.