ఐపీఎల్-2021లో భాగంగా శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనింగ్ స్పెల్ వేసిన చాహర్.. 4 ఓవర్లలో 13 పరుగులిచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. పంజాబ్ కీలక ఆటగాళ్లు మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, దీపక్ హుడా, నికోలస్ పూరన్ వికెట్లు తీసి ప్రత్యర్థి కోలుకోలేని దెబ్బ కొట్టాడు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చాహర్ దారుణ ప్రదర్శన చేశాడు. ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన చాహర్.. ఏకంగా 9 ఎకానమీతో 36 పరుగులు సమర్పించుకున్నాడు. దానికి తోడు కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో అతడి బౌలింగ్‌పై భారీగా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఓ క్రికెట్ అభిమాని చాహర్‌కు ఓ మెసేజ్ పంపించాడు. ఆ విషయాన్ని చాహర్ స్వయంగా పంజాబ్ అనంతరం వెల్లడించాడు.
ఢిల్లీ మ్యాచ్ తరువాత తాను గదికి వెళ్లి తన సోషల్ మీడియా ఖాతాలో ఏమైనా మెసేజ్‌లు వచ్చాయేమోనని చెక్ చేసుకున్నానని, ఆ సమయంలో ఓ యువకుడి నుంచి మెసేజ్ వచ్చిందని, ఆ మెసేజ్ చూడగానే.. తనకు చాలా బాధ కలిగిందని చామర్ వెల్లడించాడు. మ్యాచ్ అనంతరం సహచర ఆటగాడు శార్దూల్ ఠాకూర్‌తో ముచ్చటిస్తూ ఈ విషయాన్ని తెలిపాడు. ఆ మెసేజ్‌లో ‘‘భాయ్ మీరు మంచి బౌలర్ అని నాకు తెలుసు. అయితే, నాదొక విన్నపం.. మీరు తదుపరి మ్యాచ్‌లో మాత్రం ఆడకండి’’ అని మెసేజ్ పెట్టాడం’టూ చాహర్ తెలిపాడు. అయితే ఆటగాళ్ల మీద ఎవరి అంచనాలు వారికి ఉంటామని, ప్రతీ మ్యాచ్‌లోనూ అద్భుతంగా రాణించాలని కోరుకుంటారని, అలా అనుకున్నందునే అతడు తనకు అలాంటి సందేశం పంపాడని చాహర్ అన్నాడు. అయితే, తాను ఒకవేళ పంజాబ్‌తో మ్యాచ్ ఆడకపోయి ఉంటే ఇలాంటి ఒక ప్రదర్శన చూసే అవకాశమే ఉండేది కాదు కదా అని అన్నాడు. అందువల్ల ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన చెత్త ప్రదర్శన చేస్తాడన్న ముద్ర ఏ ఆటగాడిపై వేయకూడదని అభిప్రాయపడ్డాడు. కుదిరితే అలాంటి ఆటగాళ్లకు మద్దతుగా నిలవాలని చాహర్ కొట్టాడు.
కాగా.. చెన్నై సూపర్ కింగ్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్‌లో పంజాబ్‌పై చెన్నై అన్ని విభాగాల్లోనూ అదరగొట్టి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై గెలుపులో ఆ జట్టు పేసర్ దీపక్ చాహర్ కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో చెన్నై జట్టు ఐపీఎల్ 14వ సీజన్లో పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. అంతేకాకుండా.. ఈ మ్యాచ్ ధోనీకి 200వ మ్యాచ్ కావడంతో అతడికి మరపురాని విజయం లభించినట్లైంది.