Sunday, March 22, 2026

ధోనీ గొప్పతనం అదే.. పంజాబ్ మ్యాచ్ తర్వాత ఫోటో వైరల్.. ఫ్యాన్స్ ఫిదా

ఐపీఎల్‌-2021లో భాగంగా, శుక్రవారం నాటి మ్యాచ్‌ అనంతరం పంజాబ్‌ కింగ్స్‌‌తో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఐపీఎల్‌లో ధోనీ ఆడుతున్న 200వ మ్యాచ్ కావడం, అందులో గెలవడం అతడికి చాలా గొప్ప అనుభూతినిచ్చింది. దీంతో మరపురాని విజయాన్ని కైవసం అందుకున్నాడు. అయితే మ్యాచ్ ముగిసిన తరువాత డగౌట్‌లో కూర్చుని ఉన్న ధోనీకి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖాళీగా కూర్చుని ఉన్న ధోనీ వద్దకు పంజాబ్ బ్యాట్స్‌మన్ షారూఖ్ ఖాన్ వచ్చాడు. బ్యాటింగ్‌కు సంబంధించి కొన్ని సందేహాలను వెలిబుచ్చాడు. అతడు ప్రత్యర్థి జట్టు ఆటగాడైనా.. ధోనీ అతడితో చాలా సేపు మాట్లాడాడు. బ్యాటింగ్ మెరుగుదలకు సంబంధించి విలువైన సలహాలు, సూచనలు ఇచ్చాడు.

షారూఖ్ ఖాన్‌తో ధోనీ మాట్లాడుతున్న ఫొటోను సీఎస్‌కే సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ‘ఒకరు ఫినిషర్‌.. మరొకరు అదే బాటలో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న ఆటగాడు’ అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ రాసుకొచ్చింది. కాగా.. అనేకమంది క్రికెట్ అభిమానులు ఈ ఫోటోపై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఐపీఎల్‌ యాజమాన్యం సైతం ఈ ఫోటోపై స్పందించింది. ‘‘బ్యూటీ ఆఫ్‌ ఐపీఎల్‌’’ అని కామెంట్‌ చేసింది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ధోని ఫ్యాన్స్‌ను విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌కు సలహాలు ఇస్తున్న విధానానికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. ‘‘దటీజ్‌ ధోని’’ అంటూ ధోనీని ఆకాశానికెత్తేస్తున్నారు.


కాగా.. సీఎస్‌కే బౌలర్‌ దీపక్‌ చహర్‌ ధాటికి తమ టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టినా షారుఖ్‌ ధైర్యంగా నిలబడి, 47 పరుగుల(36 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు)తో రాణించాడు. తమ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు మొయీన్ అలీ, ఫాఫ్ డూ ప్లెసిస్ నిలకడైన ఆటతో సునాయాసంగా విజయం సాధించింది.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -