దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతుండడంతో కొన్ని రాష్ట్రాలు పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను అములు చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు పాక్షిక లాక్‌డౌన్‌లను, కర్ఫ్యూలను అమలు పరుస్తున్నాయి. అందులో మహారాష్ట్ర ముందు వరుసలో ఉండగా.. మిగతా రాష్ట్రాలు దాని వెనకే నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో ఏప్రిల్ 5న కర్ఫ్యూ లాంటి లాక్ డౌన్ నిషేధ ఉత్తర్వులతో ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు. ఈ నెల 15 వరకు నిషేదాజ్ఞలు ఉంటాయని హెచ్చరించారు. ఇక ఢిల్లీలో లాక్ డౌన్ ను ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించారు. ఏప్రిల్ 19 నుంచి రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతోంది.
జార్ఖండ్‌లో మే 6వ తేదీ వరకు, కేరళలో మే 9వ తేదీ వరకు, ఉత్తర్‌ప్రదేశ్‌లో 10వ తేదీ వరకు, కర్ణాటకలో 12వ తేదీ వరకు, ఛత్తీస్‌గఢ్, బిహార్‌లలో 15వ తేదీ వరకు, రాజస్థాన్‌లో 17వ తేదీ వరకు ఒడిశాలో 19వ తేదీ వరకు లాక్ డౌన్ విధించారు. పంజాబ్‌లో మినీ లాక్ డౌన్, వీకెండ్ లాక్ డౌన్‌తో పాటు కఠినమైన ఆంక్షలను అమలు చేస్తున్నారు.
కాగా.. గుజరాత్‌లోని 29 సిటీల్లో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. మధ్యప్రదేశ్‌లో ఈ నెల 7 వరకు కరోనా కర్ఫ్యూ అమలవుతోంది. అస్సాంలో నైట్ కర్ఫ్యూ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అమలవుతోంది. ఇది ఈ నెల 7 వరకు అమలులో ఉంటుంది. తమిళనాడులో మే 20 వరకు అన్ని రకాల కార్యక్రమాలపై నిషేధాజ్ఞలున్నాయి. ఇక ఆంద్ర ప్రదేశ్‌లో మే 5వ తేదీ నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు రెండు వారాల పాటు పాక్షిక కర్ఫ్యూ ప్రకటించారు. తెలంగాణ లో ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ మే 8 వరకు కొనసాగుతోంది.
ఇక తాజాగా బెంగళూరు కూడా జిల్లాల్లో 4 రోజుల లాక్‌డౌన్‌ను అమలు పరచాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. ఈ మేరకు జిల్లా ఇంచార్జి మంత్రి గోపాలయ్య బుధవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష జరిపారు. ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 6 నుంచి 10వరకు నిత్యావసరాలకు వెసలు బాటు కల్పించారు. ఈ విధానం సోమ, బుధ, శుక్రవారాలలో అమలు చేసి మిగిలిన 4 రోజుల్లో పాలు, మెడికల్ షాపులు మినహా మిగిలిన అన్ని దుకాణాలను పూర్తిగా మూసివేసి ఉంచేలా ఉత్తర్వలు జారీ చేశారు.