జూలైలో జరగబోయే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ కోసం ఇండియా ఇంగ్లండ్ బయలుదేరబోతోంది. అక్కడ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడబోతోంది. అలాగే అక్కడే ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ కూడా ఆడబోతోంది. డబ్ల్యూడీసీ ఫైనల్ మ్యాచ్, ఇంగ్లండ్ సిరీస్ కోసం మరో 3 వారాల్లో బ్రిటన్‌కు బయల్దేరబోతోంది. ఇందులో భాగంగా విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లండ్ బయలుదేరబోతోంది. జూన్ 18-22 మధ్య కివీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తరువాత అక్కడే ఇంగ్లండ్‌తో ఆగస్టులో సిరీస్ ఆడబోతోంది.
ముందుగా కొన్ని వార్మప్ మ్యాచ్‌లు ఆడి ఆ తరువాత ఆగస్టులో ఇంగ్లాండ్‌తో 5 టెస్టుల సిరీస్ ఆడబోతోంది. దాదాపు మూడున్నర నెలల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. అయితే ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు, జులైలో టీమిండియా టీ20, వన్డే సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటించబోతోంది. అదెలా సాధ్యమవుతుందని అనుకోకండి. దీనికోసం బీసీసీఐ ఓ ప్రణాళిక ఆలోచించింది. అందులో భాగంగానే ఎప్పటి నుంచో అనుకుంటున్నట్టుగా రెండు జట్లతో బరిలోకి దిగాలని అనుకుంటోంది.
కోహ్లీ సేన ఇంగ్లండ్‌లో ఉండగా.. లంకకు మరో భారత జట్టు వెళ్లనుంది. ఇంగ్లాండ్ పర్యటనలో భాగమైన ఆటగాళ్లను మినహాయించి పరిమిత ఓవర్ల క్రికెట్ స్పెషలిస్టులతోనే మరో జట్టును ఎంపిక చేసి లంకకు పంపబోతోంది. ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఓ ప్రకటన వెలువరించాడు. ఈ పర్యటనలో లంకతో టీమిండియా 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక కాని శిఖర్ ధవన్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్ లాంటి సీనియర్లకు తోడు పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్, దేవ్‌దత్ పడిక్కల్, రాహుల్ తెవాటియా లాంటి కుర్రాళ్లను ఈ పర్యటనకు పంపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అలాగే గాయం నుంచి కోలుకున్న తరువాత శ్రేయస్ అయ్యర్ కూడా లంకకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లందరికీ టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఈ పర్యటన ఉపయోగపడుతుందని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.