కరోనా దెబ్బకు ప్రపంచం వణికిపోతోంది. లక్షల సంఖ్యలో ప్రతి రోజూ కేసులు నమోదవుతున్నాయి. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కేసులతో దేశం అల్లకల్లోలమవుతోంది. ఇదంతా ఈ ఏడాది దారుణం. ఇక గతేడాది ఇలాంటి దారుణ పరిస్థితులే అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రెజిల్ తదితర దేశాల్లో ఈ వైరస్ విలయతాండవం చేసింది. అయితే మానవజాతికే ప్రమాదంగా మారిన ఈ వైరస్‌ను.. ఆయుధంగా ఏ దేశమైనా ఉపయోగించుకోవాలని చూస్తుందా? కానీ తొలిసారి ఈ వైరస్ చైనాలో వెలుగు చూసిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్‌ను చైనా ఆయుధంగా ఉపయోగించాలనుకుందట. అది కూడా ఈ వైరస్ తొలిసారిగా ఎదురు చూడడానికి నాలుగేళ్ల ముందే. 2015లోనే. తాజాగా దీనిపై ఆస్ట్రేలియాకు చెందిన ఓ పత్రిక ప్రచురించిన కథనం ఇప్పుడు సంచలనం రేపుతోంది.
సార్స్(ఎస్ఏఆర్ఎస్) కరోనా వైరస్‌ను బయో ఆయుధంగా ఉపయోగించాలని అనుకుంటున్నట్లుగా చైనా మిలటరీ సైంటిస్టులు, హెల్త్ అధికారులు రాసిన ఓ నివేదికను ఈ పత్రిక బయటపెట్టింది. ఈ సరికొత్త వైరస్‌తో బయో ఆయుధాల్లో కొత్త శకం ప్రారంభమవుతుందని అప్పటి నివేదికలో చైనా శాస్త్రవేత్తలు పేర్కొన్నట్లు ఆ కథనంలో పత్రిక రాసుకొచ్చింది. ఈ వైరస్‌ను కృత్రిమంగా మానిప్యులేట్ చేయవచ్చని, ఇలా ఇదొక భయంకరమైన వైరస్‌గా ఎదుగుతుందని వారు రాసుకొచ్చారు. ఆ సమయంలో దీన్ని ఆయుధంగా మార్చి, ఉపయోగించుకోవచ్చని మిలటరీ సైంటిస్టులు అభిప్రాయపడ్డట్లు అందులో ఉంది.
ఈ వార్త ఇప్పుడు ప్రపంచాన్ని మళ్లీ వణికిస్తోంది. అన్ని దేశాలకు మరోసారి చైనాపై అనుమానాలు పెంచింది. గతంలో కూడా కరోనా వైరస్‌ను చైనా కావాలనే తమ ల్యాబుల్లో తయారుచేసినట్లు విపరీతంగా పలు దేశాలు ఆరోపణలు చేశాయి. అయితే వాటికి ఎటువంటి ఆధారాలూ దొరకలేదు. అలాగే చైనాలో కరోనా మూలాలపై ఇతర దేశాల శాస్త్రవేత్తలు పరిశోధన చేయకుండా కూడా ఆ దేశం అడ్డుకుంది. ఆ తర్వాత చైనా పరిశోధకులకు అనుమతులిచ్చినా.. అప్పటికే చైనా తమకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను నాశనం చేసేసి ఉంటుందంటూ అనేకమంది అభిప్రాయపడ్డారు. ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఒక పత్రిక.. చైనా మిలటరీకి చెందిన డాక్యుమెంట్లను ప్రచురించడంపై ఇప్పుడు తాజాగా మరోసారి విపరీతంగా చర్చ మొదలవుతోంది. మరి దీనిపై ఇప్పుడు కరోనా నుంచి బయటపడిన ప్రపంచ దేశాలు దీనిపై మళ్లీ దృష్టి సారిస్తాయో లేదో చూడాలి. అయితే ఇప్పుడు భారత్ మాత్రం ఈ వైరస్ వల్ల దారుణ పరిస్థితులు ఎదుర్కొంటోంది. మరి ఇండియా ఏం చేస్తుందో చూడాలి.