టీమిండియాకు హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కంగారు పడకండి.. రవిశాస్త్రిని తొలగించలేదు. అదేంటి..? రవిశాస్త్రిని తీసేయకుండా ద్రవిడ్ ఎలా హెడ్ కోచ్ చేస్తారు..? అని ఆలోచనలో పడ్డారా..? అప్పుడేనా.. ఇంకా మరో ట్విస్ట్ ఉంది. నిజానికి ద్రవిడ్‌ను హెడ్ కోచ్‌ను చేసింది టీమిండియా రెండో జట్టుకు. అవును.. మీరు విన్నది నిజమే. టీమిండియా సెకండ్ టీంకి ద్రవిడ్ హెడ్ కోచ్‌గా ఉండబోతుండగా.. కాగా టీమిండియా ఫస్ట్ టీంకు రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా ఉంటాడు.
భారత క్రికెట్ మండలి ఎప్పటినుంచే అనుకుంటున్న టీమిండియా డబుల్ టీంల ఆలోచన ఎట్టకేలకు ఆచరణలోకొచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అనేక వార్తలు బయటకొచ్చాయి. ఈ క్రమంలోనే ద్రవిడ్‌ను టీమిండియా 2కు హెడ్ కోచ్‌గా నియమించినట్లు తెలుస్తోంది.
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్, ఇంగ్లాండ్‌తో సుదీర్ఘ ఫార్మాట్ కోసం సెలక్టర్లు 20 మందితో జంబో జట్టును బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. ఈ జట్టులో నలుగురిని స్టాండ్‌బైగా ఎంపిక చేసింది. కేఎల్ రాహుల్, వృద్ధిమాన్ సాహా ఫిట్‌నెస్ నిరూపించుకొంటే వారు కూడా బ్రిటన్‌కు వెళ్తారని బీసీసీఐ ఇప్పటికే చెప్పింది. ఇదే సమయంలో మరో జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. ఈ టోర్నీకి సంబందించి కూడా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ అధికారికంగా ప్రకటన చేశారు. పరిమిత ఓవర్ల క్రికెట్ స్పెషలిస్టులే ఈ జట్టులో ఉంటారని కూడా ఆయన స్పస్టం చేశారు.
కాగా.. ఇంగ్లాండ్ పర్యటించే జట్టులోనే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి వంటి సీనియర్లు ఉన్నారు. వారితోనే కోచ్ రవిశాస్త్రి, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లు, ఫిజియోలు ఉంటారు. ఇక శ్రీలంకలో పర్యటించే జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అండర్-19, భారత్-ఏ జట్లకు కోచ్‌గా విజయవంతమైన రాహుల్ ద్రవిడ్‌ను లంకకు పంపిస్తారని సమాచారం. కోచ్‌గా రాహుల్ అనుభవం ఏంటో ప్రస్తుతం టీమిండియాలోకి వస్తున్న యువ ఆటగాళ్లను చూస్తే తెలుస్తుంది. ఈ జట్టులో శిఖర్ ధవన్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్ వంటి ఆటగాళ్లు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.